Ads
పెళ్లైన చాలా మంది స్త్రీలు తల్లి కావాలి అని పరితపిస్తుంటారు. కానీ కొంత మందికి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా కూడా సంతానం కలగరు. ఆ స్త్రీ ఎదుర్కొనే సమస్యల గురించి పట్టించుకోకుండా సమాజం వారిని ఏదో ఒక రకంగా ఇబ్బందికి గురి చేస్తూనే ఉంటుంది.
Video Advertisement
చుట్టూ ఉన్న బంధువులు కూడా మాటలతో మానసికంగా ఇబ్బందులు పెడుతుంటారు. ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్న కొంత మంది ధైర్యంగా తిరిగి సమాధానం చెప్తే, ఇంకొంతమంది మాత్రం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇలాంటి సంఘటన ఇటీవల కర్నూల్ లో జరిగింది.
source : Suman Tv
వివరాల్లోకి వెళితే, సుమన్ టీవీ కథనం ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ కర్నూలు నగరం పాతబస్తీకి చెందిన భారతి ఇకండ్ల ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నారు. ఆమె తన మేనత్త కొడుకు, సొంత బావ అయిన గోపికృష్ణతో 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారిద్దరికీ పిల్లలు లేరు. ఎంత మంది డాక్టర్లకు చూపించినా, ఎన్ని పూజలు చేసినా కూడా ఫలితం లేదు. దాంతో చుట్టుపక్కల ఉన్నవాళ్లు మాత్రమే కాకుండా, అత్తింటి వారితో సహా అందరూ భారతిని తిట్టడం మొదలు పెట్టారు.
representative image
సొంత భర్త కూడా ఇలాగే అన్నాడు. దాంతో భాధకు గురైన భారతి ఉరివేసుకొని ఆత్మహత్యకి పాల్పడ్డారు. ఇది చూసిన కుటుంబ సభ్యులు భారతిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఫలితం లేదు. అత్తింటివారి మాటలు, భర్త మాటలు తట్టుకోలేక భారతి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేస్ నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.
End of Article