Ads
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లైగర్. ఈ సినిమా విజయ్ దేవరకొండ మొదటి పాన్ ఇండియన్ సినిమా.
Video Advertisement
అంతకుముందు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్, అలాగే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల అయ్యాయి. కానీ ఈ సినిమా మాత్రం పూర్తి స్థాయి పాన్ ఇండియన్ సినిమాగా రూపొందుతోంది. ఈ సినిమాతో అనన్య పాండే హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.
పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, చార్మి, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
#1
#2
#3
ఈ సినిమా వచ్చే సంవత్సరం థియేటర్లలో విడుదల అవ్వబోతోంది. అయితే, ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇవాళ విడుదల అయ్యింది.
#4#5
#6
డిసెంబర్ 29వ తేదీన ఒక అనౌన్స్మెంట్ వీడియో, డిసెంబర్ 30వ తేదీన సినిమా నుండి మేకింగ్ స్టిల్స్, ఇంస్టాగ్రామ్ ఫిల్టర్, డిసెంబర్ 31వ తేదీన ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేస్తున్నట్టు సినిమా బృందం ప్రకటించింది.
#7#8
#9
దీంతో చాలా మంది, “ఇలా ఇన్ని అప్డేట్స్ ఒకేసారి ఇచ్చే బదులు డైరెక్ట్ గా టీజర్ విడుదల చేయొచ్చు కదా” అని అంటున్నారు. ఇంకొంతమంది ఏమో, “కనీసం ఇప్పుడైనా అప్డేట్ ఇచ్చారు. లేకపోతే అసలు ఈ సినిమా ఉందని మార్చిపోయాము” అని ట్రోల్ చేస్తున్నారు.
#10#11
End of Article