Home Filmy Adda రాధే శ్యామ్: ప్రభాస్ “కళ్లల్లో” ఇది గమనించారా.?

రాధే శ్యామ్: ప్రభాస్ “కళ్లల్లో” ఇది గమనించారా.?

by Mohana Priya

ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్ లో రాధే శ్యామ్ సినిమా రాబోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాధే శ్యామ్ గురించి అభిమానులు దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

రాధే శ్యామ్ ఓ వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించనున్నారు. అలా అని ఇది బయోపిక్ కాదు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. కృష్ణం రాజు సమర్పణలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ప్రమోద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన రాధే శ్యామ్‌ టీజర్, పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల ఆసక్తిని ఇంకా పెంచాయి.

did you observe this in prabhas eyes in radhe shyam trailer

ఈ సినిమా ట్రైలర్ లో చాలా విషయాల గురించి క్లూ ఇచ్చారు. ఇందులో కొన్ని షాట్స్ లో చిన్న చిన్న డీటెయిల్స్ కూడా రివీల్ చేశారు. అందులో ఒకటి మధ్యలో కనిపించే ఈ షాట్. విక్రమాదిత్యకి అన్నీ తెలుసు అని కృష్ణం రాజు గారు చెప్తూ ఉంటారు. అప్పుడు వచ్చే సీన్ లో ప్రభాస్ ని సరిగ్గా గమనిస్తే, ప్రభాస్ కంట్లో కొన్ని పిక్చర్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటిలో కొంత మంది మనుషులు, అలాగే కొన్ని సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి. ఈ షాట్ కొన్ని సెకన్లు మాత్రమే ఉంటుంది.

did you observe this in prabhas eyes in radhe shyam trailer

ప్రభాస్ కంట్లో అలా కొంత మంది మనుషులు, కొన్ని సంఘటనలు కనిపించడానికి అర్థం ఏంటి అంటే, విక్రమాదిత్య రాబోయే ప్రమాదాల గురించి ముందే పసిగడతాడు. అందుకే అంతకుముందు విడుదలైన టీజర్ లో కూడా విక్రమాదిత్య పాత్ర, “నాకు అన్నీ తెలుసు” అని చెప్తూ ఉంటాడు. ఇదే విధంగా ప్రేరణ జీవితంలో జరగబోయే సంఘటనలు కూడా విక్రమాదిత్యకి ముందే తెలుస్తాయి. కొంత మంది సినిమా పునర్జన్మ నేపథ్యంలో సాగుతుంది అంటూ ఉంటే, కొంత మంది మాత్రం అలా ఏమీ లేదు అని అంటున్నారు. మరి అసలు రాధే శ్యామ్ కథ ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.

You may also like