Home Filmy Adda ఊ అంటావా సక్సెస్ తర్వాత… యశోదగా “సమంత” పోరాటం ఎవరితో.?

ఊ అంటావా సక్సెస్ తర్వాత… యశోదగా “సమంత” పోరాటం ఎవరితో.?

by Mohana Priya

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో సమంత ఒకరు. తన సినిమాలకు సంబంధించిన విషయాలను కానీ, లేదా ఇతర విషయాలను కానీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.

అలాగే చాలా సార్లు తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమంత సోషల్ మీడియా ద్వారా సమాధానం చెప్పారు. ఇవన్నీ మాత్రమే కాకుండా ఎంతో మందిని ప్రోత్సహించేలాగా కూడా సమంత పోస్ట్ చేస్తూ ఉంటారు.

samantha finishes the first schedule of yashoda

ప్రస్తుతం సమంత వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. తమిళ్ విజయ్ సేతుపతితో ఒక సినిమాలో నటిస్తున్న సమంత, తెలుగులో కూడా ఇటీవల యశోద అనే ఒక సినిమా ప్రకటించారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల అవుతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఇందులో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకి హరి అండ్ హరీష్ అనే ఇద్దరు దర్శకత్వం వహిస్తున్నారు. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలయ్యింది. షూటింగ్ కూడా చాలా వేగంగా జరుగుతోంది.

samantha finishes the first schedule of yashoda

మొదటి షెడ్యూల్ కూడా పూర్తయిందని సమాచారం. ఇందులో మహిళల కోసం పోరాడే పాత్రలో సమంత నటిస్తున్నారు. సమంత పాత్ర కూడా చాలా కొత్తగా ఉంటుందట. ఇంతకీ ఆ పోరాటం ఎవరితో అనే థ్రిల్లింగ్ ఎలిమెంట్ తో ఈ సినిమా సబ్జెక్టు ఉంటుంది అంట. అంతే కాకుండా, సమంత అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇవన్నీ మాత్రమే కాకుండా ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ కి ఇండియన్ రీమేక్ లో కూడా సమంత నటిస్తున్నారు అని సమాచారం. దీనికి ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోగా వరుణ్ ధావన్ నటిస్తున్నారు. సౌత్ లోనే కాదు బాలీవుడ్ లోను “సమంత” మంచి గుర్తింపు సాధించారు. ఇప్పుడు వరస సినిమాలతో బిజీగా ఉండడంతో “సమంత ప్లానింగ్ మాములుగా లేదుగా” అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

You may also like