Home Filmy Adda హాట్ టాపిక్ అవుతున్న తమన్‌ వరుస ట్వీట్లు… అసలేం అయ్యింది..?

హాట్ టాపిక్ అవుతున్న తమన్‌ వరుస ట్వీట్లు… అసలేం అయ్యింది..?

by Megha Varna

హిట్ మ్యూజిక్ ని అందిస్తూ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు పొందారు ఎస్.ఎస్.తమన్. అయితే సాధారణంగా తమన్ చాలా కూల్ గా కనపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు తమన్ చేసిన ట్వీట్లు ఇండస్ట్రీ లో దుమారం రేపుతున్నాయి. అయితే అసలు ఏమైంది..?, ఎందుకు తమన్ అలా ట్వీట్లు చేస్తున్నారు అనే విషయంలోకి వస్తే.. తమన్ చేసిన ట్వీట్స్ నానిని ఉద్దేశించి ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

నాచురల్ స్టార్ నాని తాజాగా తన సినిమాలో అన్ని క్రాఫ్ట్స్ లాగ మ్యూజిక్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని అన్నారు. అలానే సంగీతం కానీ బీజీఎమ్ కానీ సినిమాని ఎలివేట్ చెయ్యాలే కానీ ఎప్పుడు కూడా అవి డామినేట్ చేయకూడదని నాని శ్యామ్ సింగ రాయ్ ప్రమోషన్స్ లో భాగంగా చెప్పారు.

అయితే దీన్ని ఉద్దేశించి తమన్ ఒక కౌంటర్ ఇచ్చారు. అన్ని క్రాఫ్ట్ లు కలిపి పని చేస్తేనే విజయవంతం అవుతుంది సినిమా అని చెప్పారు తమన్. ఒక్క క్రాఫ్ట్ దేనినీ డామినేట్ చేయదని.. వరుస ట్వీట్లు చేశారు. అయితే ఇవి నానిని ఉద్దేశించి ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు.

 

 

You may also like