టర్కీ అమ్మాయికి మూడు ముళ్ళు వేసిన గుంటూరు అబ్బాయి… ఇంతకీ ప్రేమ ఎలా మొదలైందంటే..?

టర్కీ అమ్మాయికి మూడు ముళ్ళు వేసిన గుంటూరు అబ్బాయి… ఇంతకీ ప్రేమ ఎలా మొదలైందంటే..?

by Megha Varna

Ads

ప్రేమ అనేది జీవితంలో చాలా మధురమైనది. అయితే ప్రేమించిన వాళ్ళతో పెళ్లి అనేది రాసి పెట్టి ఉండాలి. ప్రతి ఒక్కరి ప్రేమ కూడా సక్సెస్ అవుతుందని మనం చెప్పలేము. చాలా మంది ప్రేమలో పడి తర్వాత వివిధ కారణాల వల్ల విడిపోతూ ఉంటారు. కానీ నిజంగా ప్రేమలో పడి.. పెళ్లి కనుక చేసుకుంటే ఆ ఆనందమే నెక్స్ట్ లెవెల్.

Video Advertisement

తాజాగా ఒక ప్రేమికుడు తన ప్రేమని నిలబెట్టుకున్నాడు. ఏడడుగులూ వేసి ఒకటయ్యారు. అయితే ఇది చాలా విచిత్రమైన ప్రేమ కథ. ఎందుకంటే ఆ అమ్మాయి టర్కీకి చెందింది. అబ్బాయేమో గుంటూరువాసి. వీళ్ళ పెళ్లి ఇప్పుడు సెన్సేషన్ గా మారింది.

ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. గుంటూరు ఆత్మ డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ దొమ్మేటి వెంకటేశ్వర్లు కుమారుడు మధు సంకీర్త్ టర్కీ లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అతను అదే కంపెనీ లో పని చేస్తున్న టర్కీ లోని ఇజ్‌మిర్‌ నగర్‌కు చెందిన గిజెమ్‌ తో ప్రేమ లో పడ్డాడు. ఇంకేం ఉండి అమ్మాయి కూడా సరే అంది. ఇరు కుటుంబాలు కూడా అంగీకరించడంతో వీళ్ళ వివాహం హిందూ సాంప్రదాయ ప్రకారం గుంటూరు భారత్‌ పేట ఆరో వీధిలోని తన్విక ఫంక్షన్‌ లో జరిగింది.


End of Article

You may also like