ఎందుకు అలా ఉంటున్నావు అని అడిగిన భర్తకి దిమ్మతిరిగే షాక్…కానీ ఆఖరికి..?

ఎందుకు అలా ఉంటున్నావు అని అడిగిన భర్తకి దిమ్మతిరిగే షాక్…కానీ ఆఖరికి..?

by Megha Varna

Ads

ఈ భర్త చేసిన పని చూస్తే ఎవరైనా షాక్ అవుతారు. ఏ భర్తా కూడా ఇలా చేయడు. ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ఈ వార్త చూసిన వాళ్లంతా అవాక్ అవుతున్నారు. ఇక అసలు ఏం అయ్యింది అనేది చూస్తే.. తనతో తన భార్య సరిగ్గా ఉండడం లేదని ఆమె కోరుకున్న వ్యక్తికి ఇచ్చి వివాహం చేసేసాడు. వినడానికి సినిమాలో సీన్ లాగ ఉన్నప్పటికీ ఇది నిజంగా జరిగిన సంఘటన.

Video Advertisement

దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే… బీహార్ లోని బల్తార్ గ్రామానికి చెందిన వ్యక్తి బెంగళూరు లో పని చేస్తున్నాడు. అక్కడే తన భార్య తో పాటు జీవనాన్ని సాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం అతనికి వివాహమైంది. అయితే ఆమె మాత్రం వివాహం అయినప్పటి నుండి ఎప్పుడూ సంతోషంగా లేదు. ఓ రోజు ఇంక చూసి చూసి ఆమెని ఏమైంది అని అడిగేశాడు.

అసలు విషయం మొత్తం చెప్పేసింది భార్య. పెళ్లికి ముందు ఒక వ్యక్తిని ప్రేమించానని.. అది తెలిసి కుటుంబ సభ్యులు తనకి ఈ పెళ్లి చేశారని చెప్పేసింది. అందుకే ఇలా ఉంటున్నాను అని చెప్పడంతో మొదట షాక్ అయ్యాడు భర్త. ఆ తరవాత ప్రియుడికి భార్యని ఇచ్చి వివాహం చేసాడు. ఆ తర్వాత అతని వెంట ఆమెను ఇచ్చి పంపేశాడు. దీనికి సంబందించిన వీడియో వైరల్ అవుతోంది.


End of Article

You may also like