Home Filmy Adda ఈ “యూట్యూబ్ హీరో” మామయ్య… ప్రముఖ “స్టార్ డైరెక్టర్” అని మీకు తెలుసా..?

ఈ “యూట్యూబ్ హీరో” మామయ్య… ప్రముఖ “స్టార్ డైరెక్టర్” అని మీకు తెలుసా..?

by Mohana Priya

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల చాలా మందికి థియేటర్లకు వెళ్లి సినిమా చూడటం అనేది ఇబ్బంది అవుతోంది. దాంతో ఓటీటీ వైపు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అందులో ఉండే కంటెంట్ కూడా అన్ని వయసులకి చెందిన ప్రేక్షకులందరినీ దృష్టిలో పెట్టుకునే తీస్తున్నారు.

ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ లాంటివి కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దాంతో వెబ్‌సిరీస్ లాంటివి కూడా చాలా పాపులర్ అవుతున్నాయి. మన తెలుగులో కూడా ఈ వెబ్ సిరీస్ గత కొంత కాలం నుండి ఎక్కువగా వస్తున్నాయి.

youtube star ravi shiva teja is son in law of famous star director

ఈ వెబ్‌సిరీస్‌లో నటించే వాళ్ళు కూడా సినిమా యాక్టర్స్ కి సమానంగా పాపులారిటీ పొందుతున్నారు. అలా యూట్యూబ్, వెబ్‌సిరీస్ ద్వారా ఫేమస్ అయ్యి, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సెలబ్రిటీలు ఎంతో మంది ఉన్నారు. అలా యూట్యూబ్‌లో ఎన్నో సిరీస్‌లో నటించి, ఫేమస్ అయిన నటుడు రవి శివ తేజ. రవి శివ తేజ తాడేపల్లి గూడెంకి చెందినవారు. ఎన్నో షార్ట్ ఫిల్మ్స్, వెబ్‌సిరీస్‌లో నటించారు. ఇటీవ‌ల వ‌చ్చిన సూర్య సిరీస్‌లో కూడా హీరో ఫ్రెండ్‌గా న‌టించారు రవి శివ తేజ.

youtube star ravi shiva teja is son in law of famous star director

రవి శివ తేజది ప్రేమ వివాహం. కొద్ది సంవత్సరాల క్రితం శ్యామనితో వివాహం జరిగింది. రవి శివ తేజ ప్రేమించిన శ్యామని తండ్రి మరెవరో కాదు. ప్రముఖ దర్శకుడు విజయభాస్కర్. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, ప్రేమ కావాలి ఇంకా ఎన్నో సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో స్టార్ దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు విజయభాస్కర్.  ఈ విషయం తెలియగానే ముందు చాలా భయపడ్డారు అని, కానీ విజయభాస్కర్ చాలా మంచి వ్యక్తి అని, చాలా బాగా మాట్లాడతారు, తన పిల్లల నిర్ణయాలకు చాలా విలువ ఇస్తారు అని, తనని కూడా సొంత కొడుకులా చూసుకుంటారు అని రవి శివ తేజ ఒక సందర్భంలో చెప్పారు.

You may also like