Ads
సోషల్ మీడియాలో నటీ నటులు తరచూ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు రీసెంట్ గా తీసుకున్న ఫోటోలు షేర్ చేయడం లేదంటే చిన్ననాటి ఫోటోలు షేర్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. తారలు కనుక చిన్ననాటి ఫోటోలు కనుక షేర్ చేసారు అంటే ఫ్యాన్స్ ఎంతో హ్యాపీ అయిపోతారు. అంతే కాదు చిన్ననాటి ఫోటోలని కనుక నటీనటులు షేర్ చేశారంటే క్షణాల్లో అవి వైరల్ అయిపోతాయి.
Video Advertisement
ఇది ఎప్పటికీ ట్రెండీ గానే ఉంటుంది. చాలా మంది నటీనటులు ఇప్పటికే తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అయితే తాజాగా మరో ముద్దుగుమ్మ తన చైల్డ్ హుడ్ ఫోటోని షేర్ చేసింది. ఆ ఫోటో కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అందంగా, క్యూట్ గా నవ్వుతూ ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎవరో ఈ పాటికే మీరు గుర్తు పట్టేసి ఉండాలి. ఈ భామ టాలీవుడ్, కోలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తనకంటూ ఓ అద్భుతమైన ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకుంది. తమిళంలో అయితే స్టార్ హీరోల పక్కన నటించి ప్రేక్షకులను ఫిదా చేసింది. కేవలం ఒక హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఆల్రౌండర్ గా కూడా ఈమె పేరు తెచ్చుకుంటోంది.
ఫార్ములా వన్ రేసింగ్ లో తన మార్కు చూపిస్తోంది ఈ తార. మరి ఈ ముద్దుగుమ్మ నివేద పేతురాజ్ అని ఇప్పటికే మీకు తెలిసిపోయింది కదా..? ఆమె మన టాలీవుడ్ లో చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురంలో, రెడ్, పాగల్ వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకి దగ్గరై పోయింది.
End of Article