Ads
ప్రస్తుతం పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది.
Video Advertisement
దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు. అయితే, పుష్ప సినిమా టాక్ మాత్రం మిక్స్డ్ గానే వస్తోంది. పుష్ప సినిమా థియేటర్లలో నడుస్తుండగానే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. హిందీ వెర్షన్ తప్ప మిగిలిన అన్ని భాషల్లో సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.
పుష్ప సినిమాతో ప్రముఖ మలయాళం స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇందులో షెకావత్ పాత్రలో ఫహాద్ నటించారు. తెలుగులో తనకి మొదటి సినిమా అయినా కూడా ఫహాద్ తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఫహాద్ నటించిన సినిమాల్లో చాలా తక్కువ సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. దాంతో ఫహాద్ ని చూసిన చాలా మంది ప్రేక్షకులు, “ఎవరు ఇతను?” అనుకున్నారు. కానీ ఓటీటీలో మాత్రం ఫహాద్ నటించిన కొన్ని సినిమాలు తెలుగు డబ్బింగ్ వెర్షన్ విడుదలయ్యాయి.
ఫహాద్ తండ్రి ఫాజిల్ పెద్ద డైరెక్టర్. మలయాళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు రూపొందించారు. అలాగే తెలుగులో కూడా ఒక సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ సినిమానే కిల్లర్. ఇందులో నాగార్జున, నగ్మా హీరో హీరోయిన్లుగా నటించారు. అలాగే ఫాజిల్ ఎన్నో తమిళ్, మలయాళం సినిమాలకి దర్శకత్వం వహించి ఎన్నో అవార్డ్ లను పొందారు. చంద్రముఖి ఒరిజినల్ మలయాళం వెర్షన్ మణిచిత్రతళు సినిమాకి కూడా దర్శకత్వం వహించారు.
అంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా ఫహాద్ నటుడిగా పేరు తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డారు. మొదట్లో ఫహాద్ యాక్టింగ్ ని అందరు ట్రోల్ చేసారు. తర్వాత సినిమాలతో తాను ఎంత మంచి నటుడో ఫహాద్ నిరూపించుకున్నారు. ప్రస్తుతం పుష్ప – ద రూల్ లో కూడా ఫహాద్ నటిస్తున్నారు. ఇందులో ఫహాద్ పాత్రకి ఎక్కువ నిడివి ఉంటుంది. ఒక రకంగా అల్లు అర్జున్, ఫహాద్ మధ్యే దాదాపు 2 వ పార్ట్ కథ మొత్తం ఉంటుంది.
End of Article