Home Filmy Adda ఏంటి… “పుష్ప” లోని ఈ సీన్ కాపీనా..? ఏ సినిమా నుండి అంటే..?

ఏంటి… “పుష్ప” లోని ఈ సీన్ కాపీనా..? ఏ సినిమా నుండి అంటే..?

by Mohana Priya

ప్రస్తుతం పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది.

దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు. అయితే, పుష్ప సినిమా టాక్ మాత్రం మిక్స్డ్ గానే వస్తోంది. పుష్ప సినిమా థియేటర్లలో నడుస్తుండగానే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. హిందీ వెర్షన్ తప్ప మిగిలిన అన్ని భాషల్లో సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.

pushpa anasuya sunil scene inspired from a hollywood movie

ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్ మాత్రమే కాకుండా సహాయ నటీనటులకు కూడా మంచి పేరు వచ్చింది. ఇందులో మంగళం శ్రీనుగా సునీల్ నటించారు. మంగళం శ్రీను భార్య దాక్షాయిని పాత్రలో అనసూయ నటించారు. అనసూయ సినిమాలో కొంచెం సేపు మాత్రమే కనిపిస్తారు. కానీ, సినిమాలో అనసూయ పాత్ర ఎండ్ అయిన విధానం చూస్తే సెకండ్ పార్ట్ లో ముఖ్య పాత్ర అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అనిపిస్తుంది.

pushpa anasuya sunil scene inspired from a hollywood movie

ఈ సినిమాలో సునీల్ కి, అనసూయకి మధ్యలో ఒక సీన్ ఉంటుంది. తన తమ్ముడు చనిపోయాడు అని కోపంలో ఉన్న దాక్షాయిని, మంగళం శ్రీనుపై దాడి చేస్తుంది. అయితే, ఈ సీన్ ఒక ఇంగ్లీష్ సినిమా నుండి ఇన్స్పైర్ అయ్యి తీశారు. హాలీవుడ్ సినిమా అయిన గుడ్‌ఫెల్లాస్ లోని ఒక సీన్ దగ్గర దగ్గర ఇలానే ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఒక ఆమె ఇలాగే హెన్రీ అనే పాత్ర పోషించిన ఒక అతని మీద కూర్చొని, అతనికి గన్ గురి పెడుతుంది. కానీ తెలుగులో మాత్రం దాక్షాయిని బ్లేడ్ తో దాడి చేస్తుంది. పుష్ప సినిమాలోని సీన్ మొత్తం ఇలాగే కాకపోయినా కొంచెం గుడ్‌ఫెల్లాస్ సినిమాలోని ఈ సీన్ కి దగ్గరగా ఉంటుంది.

watch video :

You may also like