Home Filmy Adda లీడర్‌లో “బ్యాక్‌గ్రౌండ్‌ ఆర్టిస్ట్” గా నటించిన… ఈ “పాన్-వరల్డ్” సెలబ్రిటీని గుర్తుపట్టారా? ఎవరంటే..?

లీడర్‌లో “బ్యాక్‌గ్రౌండ్‌ ఆర్టిస్ట్” గా నటించిన… ఈ “పాన్-వరల్డ్” సెలబ్రిటీని గుర్తుపట్టారా? ఎవరంటే..?

by Megha Varna

సినిమాల్లోకి వచ్చే ముందు ఆ రంగానికి చెందిన వాళ్లు అందరూ చాలా కష్టాలు పడతారు. చిన్న చిన్న పాత్రల్లో నటించి లేదా కెమెరా వెనకాల పని చేసి ఇప్పుడు పెద్ద స్థాయికి ఎదిగిన నటులు ఎంతోమంది ఉన్నారు. అయితే, కొంత మంది డైరెక్టర్లు కూడా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు.

ఇక ఇదిలా ఉంటే, రానా దగ్గుబాటి హీరోగా నటించిన లీడర్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ప్రియా ఆనంద్, రిచా గంగోపాధ్యాయ్ రానా సరసన నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం వహించారు.

pan indian celebrity as a background artist in leader

అయితే 2010 లో వచ్చిన ఈ సినిమాలో నాగ్ అశ్విన్ కూడా ఉన్నారట. అదేంటి నాగ్ అశ్విన్ లీడర్ సినిమాలో ఉన్నారా అని షాక్ అవుతున్నారా..? నాగ్ అశ్విన్ లీడర్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సంగతి తెలిసిందే. కానీ సినిమాలో కూడా వున్నారు. సినిమా దర్శకుడిగా, స్క్రీన్ రైటర్ గా నాగ్ అశ్విన్ బాగా పాపులర్ అయ్యారు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాకి మొట్టమొదటి సారి దర్శకత్వం చేశారు నాగ్ అశ్విన్. చిత్ర పరిశ్రమలో సహాయ దర్శకునిగా నాగ్ అశ్విన్ నేను మీకు తెలుసా అనే చిత్రంతో ఇండస్ట్రీ లోకి వచ్చారు.

pan indian celebrity as a background artist in leader

తర్వాత దర్శకుడు శేఖర్ కమ్ముల దగ్గర లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశారు. రచయితగా, దర్శకుడిగా ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలు చేశారు నాగ్ అశ్విన్. మొన్న మొన్న వచ్చిన జాతిరత్నాలు సినిమాకి నిర్మాతగా పని చేశారు నాగ్ అశ్విన్.  అంతే కాకుండా ఇప్పుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ దశలో ఉంది. ఇటీవల షూటింగ్ ప్రారంభం అయ్యింది.

You may also like