Home Filmy Adda ఇదెక్కడి ఎడిట్ రా మావా… మా బాలయ్య పాటని “యాడ్” చేసేసారుగా. ?

ఇదెక్కడి ఎడిట్ రా మావా… మా బాలయ్య పాటని “యాడ్” చేసేసారుగా. ?

by Mohana Priya

సింహ, లెజెండ్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మూడవ సినిమా అఖండ. దాంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అసలు ముందే రావాల్సిన అఖండ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాతో వారిద్దరూ హ్యాట్రిక్ విజయం సాధిస్తారేమో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

సినిమాకి ముఖ్య హైలెట్ మాత్రం బాలకృష్ణ. రెండు పాత్రల్లో, అది కూడా ముఖ్యంగా అఖండ పాత్రల్లో బాలకృష్ణ చాలా పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అఖండ మొదటి షో అయిన తర్వాత నుండే హిట్ టాక్ తెచ్చుకుంది. బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాతో వారిద్దరు హ్యాట్రిక్ విజయం సాధించారు అని అంటున్నారు.

akhanda movie review

అఖండ సినిమాలో మురళీ కృష్ణగా, అఖండగా రెండు పాత్రల్లో నటించారు బాలకృష్ణ. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించారు . ఈ సినిమాకి తమన్ అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత పెద్ద ప్లస్ పాయింట్స్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ కాంబినేషన్ లో రెండు పాటలు ఉన్నాయి. అందులో అడిగా అడిగా ఒకటి. ఈ పాట వీడియో సాంగ్ ఇటీవల విడుదల చేశారు.

akhanda adiga adiga song funny advertisement edit

ఈ పాటలో హీరో, హీరోయిన్ మధ్య జరిగే లవ్ ట్రాక్, పెళ్లి, పిల్లలు చూపిస్తారు. అయితే ఈ వీడియో సాంగ్ కి సంబంధించిన ఒక ఎడిట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాటకి ఖజానా జ్యువెలరీ అడ్వటైజ్మెంట్ ఆడియో పెట్టి ఎడిట్ చేసి ఒక పక్కా ఎంటర్టైన్మెంట్ జోన్ అనే ఒక మీమ్ పేజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో చాలా మంది, “సడన్ గా చూస్తే ఇది జ్యువెలరీ అడ్వటైజ్మెంట్ లాగే ఉంది” అంటూ కామెంట్ చేస్తున్నారు.

watch video :

https://www.instagram.com/tv/CYqw6Q_JYoY/?utm_medium=copy_link

You may also like