వామ్మో!!! పెళ్లిమండపంలోనే ముద్దులతో రెచ్చిపోయారుగా..? వైరల్ అవుతున్న వీడియో.!

వామ్మో!!! పెళ్లిమండపంలోనే ముద్దులతో రెచ్చిపోయారుగా..? వైరల్ అవుతున్న వీడియో.!

by Megha Varna

Ads

పూర్వం పెళ్లిళ్లు అంటే ఎంతో సాంప్రదాయంగా జరిగేవి. ప్రతిదీ కూడా పద్ధతి ప్రకారం జరుపుతూ ఉండేవారు. కానీ నేటి కాలంలో టెక్నాలజీ బాగా పెరిగిపోవడం వలన మరియు కొత్తదనం మీద ఆసక్తి ఎక్కువ అవ్వడం వల్ల రకరకాలుగా పెళ్లిళ్లు జరుపుతున్నారు. పైగా ఫోటోలకే ప్రయారిటీ ఇస్తూ సంప్రదాయాలను పక్కన పెట్టేస్తున్నారు వధూవరులు. అలానే తమకు నచ్చినట్లు పెళ్లి మండపం మీద ప్రవర్తిస్తున్నారు.

Video Advertisement

ఇటువంటివి నెట్టింట్లో మనం తరచూ చూస్తూనే ఉంటాం. అలానే పెళ్లికి ముందు ఫోటో షూట్లు వంటివి చాలా కొత్తగా జరుపుతూ వుంటారు. తాజాగా వధూవరులు ఇద్దరూ కూడా కాస్త వెరైటీగా ప్రవర్తించి అందరినీ షాక్ కి గురి చేస్తున్నారు. ఇక అసలు ఏమైంది అనేది చూస్తే… ఈ పెళ్లికూతురు ఏకంగా అతిథులు అందరి ముందు కూడా లిప్ లాక్ ఇచ్చేసింది. ఇది ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ జంటను విడతీయడం ఎవరివల్లా కాలేదు.

మామూలుగా పెళ్లి అయిన తర్వాత వధూవరుల పేర్లు చెప్పమని అనడం లాంటివి చెప్పి ఆటపట్టిస్తూ ఉంటారు. అలానే ఈ జంటతో కూడా అక్కడున్న పెద్దలు సరదాగా ఒక మాట అనే సరికి వాళ్ళు సీరియస్ గా తీసుకున్నారు. ఇంకేముంది అక్కడున్న వాళ్ళందరూ అవాక్కయ్యారు. బంధువులు సరదాగా పెళ్లి కొడుకు తో వధువుని ముద్దు పెట్టుకోమని చెప్పారు.

వరుడు ఏకంగా ఆమెకి కిస్ ఇచ్చేసాడు. ఆ అమ్మాయి కూడా వరుడికి తగ్గట్టుగానే రెచ్చిపోయింది. వరుడు మెడ మీద చేతులు పెట్టి ముద్దు ఇచ్చేసింది. పెళ్లి పీటల మీద ఉన్నాం అన్న సంగతి మర్చిపోయి మరీ ఈ జంట రెచ్చిపోయింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిపోయింది. బంధువులు సరదాగా అన్న మాట పట్టుకుని వీళ్ళు ఇలా చేసేసరికి అక్కడున్న వారందరూ కూడా కంగుతిన్నారు. ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ కూడా ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

watch video:

 

 

 


End of Article

You may also like