Home Filmy Adda ఈ 5 కారణాల వల్లే… నెగిటివ్ టాక్‌తో కూడా “బంగార్రాజు” సూపర్‌హిట్ అయ్యిందా..?

ఈ 5 కారణాల వల్లే… నెగిటివ్ టాక్‌తో కూడా “బంగార్రాజు” సూపర్‌హిట్ అయ్యిందా..?

by Mohana Priya

నాగార్జున హీరోగా వచ్చిన “సోగ్గాడే చిన్ని నాయనా” సినిమా ఓ రేంజ్ లో హిట్ అయింది. అటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని… ఇటు మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా పార్ట్ 2 కూడా ఉంటుంది అని అప్పుడే ప్రకటించారు. అప్పటినుంచి సీక్వెల్ ఎలా ఉండబోతోందా? అని అందరిలోనూ ఉత్సుకత నెలకొంది.

ఈ సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు విడుదలకి సిద్ధమయ్యాయి. కానీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని సినిమాలు వెనకడుగు వేశాయి. బంగార్రాజు మాత్రం మొదటి నుండి సంక్రాంతి బరిలోనే ఉంది. ఏ సినిమా విడుదల అయినా కాకపోయినా మా సినిమా మాత్రం కచ్చితంగా సంక్రాంతికే విడుదల అవుతుంది అని సినిమా బృందం చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు.

reasons why bangarraju became superhit despite of negative talk

బంగార్రాజు సినిమా టాక్ మాత్రం నెగిటివ్ గా వస్తోంది. స్టోరీ అంతకు ముందు మనం సోగ్గాడే చిన్ని నాయనాలో చూసినట్టే ఉంది అని అంటున్నారు. కానీ సినిమాకి మాత్రం సూపర్ హిట్ కలెక్షన్స్ వస్తున్నాయి. దాంతో చాలా మంది, “అదేంటి సినిమా చాలా యావరేజ్ గా ఉన్నా కూడా సూపర్ హిట్ అయ్యింది?” అని అనుకుంటున్నారు. బంగార్రాజు సూపర్ హిట్ అవ్వడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

reasons why bangarraju became superhit despite of negative talk

#1 సినిమాకి మెయిన్ హైలైట్ మాత్రం నాగార్జున. కొద్ది సంవత్సరాల క్రితం వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనాలో నాగార్జున నటన చాలా మందికి నచ్చింది. నాగార్జున అంత యాక్టివ్ గా చేసి చాలా సంవత్సరాలు అయ్యింది. దాంతో మళ్లీ బంగార్రాజు పాత్రతో నాగార్జున తెరపై కనిపిస్తే చూడడానికి చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూశారు.

reasons why bangarraju became superhit despite of negative talk

#2 బంగార్రాజు విడుదల సమయానికి పెద్ద సినిమాలు ఏవి విడుదల అవ్వలేదు. దాంతో, ఈ విషయం కూడా బంగార్రాజు సినిమా హిట్ అవ్వడానికి కలిసొచ్చింది అని చెప్పాలి.

reasons why bangarraju became superhit despite of negative talk

#3 వెంకీ మామ, లవ్ స్టోరీ సినిమాలతో నాగ చైతన్య ప్రేక్షకులకు ఇంకా దగ్గరయ్యారు. నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించడం కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరగడానికి ఒక కారణం అయ్యింది.

reasons why bangarraju became superhit despite of negative talk

#4 సినిమా విడుదల అయిన సమయం కూడా హిట్ అవ్వడానికి ముఖ్య పాత్ర పోషించింది. పండగకి విడుదల అవ్వడంతో చాలా మంది ప్రేక్షకులు సినిమా చూడడానికి ఆసక్తి చూపారు.

reasons why bangarraju became superhit despite of negative talk

#5 సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకి ముఖ్య బలం అనూప్ రూబెన్స్ అందించిన మ్యూజిక్. ఈ సినిమాకి కూడా అదే రేంజ్ లో మ్యూజిక్ ఇచ్చారు అనూప్ రూబెన్స్. సినిమా విడుదలకు ముందే పాటలు విడుదల అవ్వడం, ఆ పాటలు కూడా హిట్ అవ్వడంతో సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయి.

reasons why bangarraju became superhit despite of negative talk

ఈ కారణాల వల్ల నెగిటివ్ టాక్ తో కూడా బంగార్రాజు సూపర్ హిట్ అయ్యింది.

You may also like