ఇదెక్కడి ఎడిట్ రా మావా..? వైరల్ అవుతున్న “అఖండ”లోని ఈ సీన్ ఎడిట్ చూస్తే నవ్వాపుకోలేరు..?

ఇదెక్కడి ఎడిట్ రా మావా..? వైరల్ అవుతున్న “అఖండ”లోని ఈ సీన్ ఎడిట్ చూస్తే నవ్వాపుకోలేరు..?

by Mohana Priya

Ads

సింహ, లెజెండ్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మూడవ సినిమా అఖండ. దాంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అసలు ముందే రావాల్సిన అఖండ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాతో వారిద్దరూ హ్యాట్రిక్ విజయం సాధిస్తారేమో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

Video Advertisement

సినిమాకి ముఖ్య హైలెట్ మాత్రం బాలకృష్ణ. రెండు పాత్రల్లో, అది కూడా ముఖ్యంగా అఖండ పాత్రల్లో బాలకృష్ణ చాలా పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అఖండ మొదటి షో అయిన తర్వాత నుండే హిట్ టాక్ తెచ్చుకుంది. బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాతో వారిద్దరు హ్యాట్రిక్ విజయం సాధించారు అని అంటున్నారు.

akhanda

అఖండ సినిమాలో మురళీ కృష్ణగా, అఖండగా రెండు పాత్రల్లో నటించారు బాలకృష్ణ. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించారు . ఈ సినిమాకి తమన్ అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత పెద్ద ప్లస్ పాయింట్స్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాలో కొన్ని సీన్స్ కి సంబంధించిన ఎడిట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

balayya-babu-akhanda-news

ఇందులో ఫేమస్ అయిన కొన్ని కామెడీ సీన్స్ ఆడియోకి అఖండ సినిమాలోని కొన్ని సీన్స్ వీడియోతో ఎడిట్ చేశారు. ఇందులో హీరోయిన్ హీరోని పెళ్లి చేసుకోమని అడిగే సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ లో బాలకృష్ణ రియాక్షన్ కి బ్రహ్మానందం వాయిస్ ఆడియో పెట్టి ఎడిట్ చేశారు. ఇంక సినిమా విషయానికి వస్తే అఖండ ఇటీవల డిస్నీ + హాట్‌స్టార్‌లో విడుదలయ్యింది.

watch video :

https://www.instagram.com/tv/CZG7Iuyves0/?utm_medium=copy_link


End of Article

You may also like