Home Filmy Adda “శ్యామ్ సింగ రాయ్” లో ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు..? ఏ సీన్‌లో అంటే..?

“శ్యామ్ సింగ రాయ్” లో ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు..? ఏ సీన్‌లో అంటే..?

by Mohana Priya

దాదాపు రెండు సంవత్సరాల తర్వాత థియేటర్లలో విడుదలైన నాని సినిమా శ్యామ్ సింగ రాయ్. ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల అయ్యింది.

సినిమా బృందం కూడా ఇది ఒక డిఫరెంట్ సినిమా అని ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. సినిమా 2 నేపథ్యాల్లో నడుస్తుంది. ఒకటి ప్రస్తుతం జరిగే టైం పీరియడ్ లో అయితే, మరొకటి చాలా సంవత్సరాల క్రితం కోల్‌కతాలో జరిగిన కథ. కానీ ఈ సినిమాకి ప్లస్ పాయింట్, అలాగే అసలు కథ ఎక్కువగా ఉండేది మాత్రం శ్యామ్ సింగ రాయ్ ఎపిసోడ్‌లోనే.

logic missed in shyam singha roy

ఈ ఎపిసోడ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు ఎమోషనల్‌గా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ఒక లాజిక్ మిస్ అయింది అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. హీరో ఇంట్లో నుండి వెళ్ళిపోయేటప్పుడు పడవ నడిపే అతని సహాయం కోసం వెతుకుతాడు. దేవీ నవరాత్రుల సందర్భంగా అందరూ గుళ్లో ఉన్నారు అని తెలిసి కూడా గుడికి వెళ్తాడు. అక్కడ హీరోయిన్ ని చూసి ప్రేమలో పడతాడు. తర్వాత హీరోయిన్, హీరో కలిసి పడవలో వెళుతూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే హీరోనే పడవ నడుపుతూ ఉంటాడు.

logic missed in shyam singha roy

ఒకవేళ హీరోకి పడవ నడపడం వస్తే తానే పడవ నడుపుతూ వెళ్లిపోవచ్చు కదా? ఇంకొకరి సహాయం తీసుకోవడం ఎందుకు? అని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఇంక సినిమా విషయానికొస్తే, శ్యామ్ సింగ రాయ్ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. సినిమా చూసిన వాళ్లందరూ నాని, సాయి పల్లవి నటనని మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా హిందీలో కూడా రీమేక్ అవుతుంది అని, అందులో ఒక ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో నటిస్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

You may also like