Ads
రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఈమె ఎప్పుడూ సోషల్ యాక్టివిటీస్ లో పాల్గొంటూ ఉంటారు. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ అభిమానులతో సందడి చేస్తూ వుంటారు. అయితే తాజాగా ఉపాసన చేసిన ఈ పని వైరల్ అయిపోతుంది.
Video Advertisement
అసలు ఆమె ఎందుకు ఈ పోస్ట్ పెట్టింది అని అర్థం కాక నెటిజన్లు తల బాదుకుంటున్నారు. మెగా అభిమానులు కూడా ఈ పోస్ట్ ని చూసి తిట్టేస్తున్నారు. అయితే మరి ఇంతకీ కొణిదెల ఉపాసన చేసిన పోస్టు ఏమిటి..? అసలు ఈ పోస్ట్ లో ఏముంది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. సినిమాలకి దూరంగా ఉంటున్న సరే సెలెబ్రెటీలతో కూడా మంచి బాండింగ్ ఉంటుంది ఉపాసనకు. ఈమె స్టార్ హీరోయిన్స్ తో స్పెషల్ వీడియో ప్రోగ్రామ్స్ లాంటివి కూడా చేస్తూ వుంటారు. సామ్, రకుల్ మొదలైన వారితో ఈమె గతంలో ప్రోగ్రామ్స్ చేసిన సంగతి తెలిసినదే.
రిపబ్లిక్ డే సందర్భంగా ఉపాసన ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఆ ఫోటోని ఎవరో ఆమెకి పంపడం జరిగింది. ఆ ఫోటోని ఈమె షేర్ చేసి దీనికి మీరు పేరు పెట్టండి అని వ్రాసారు. అలానే ఈ ఫోటోలో రామ్ చరణ్, ఉపాసన కూడా ఉన్నారట. అయితే ఎక్కడో కనిపెట్టగలరా అని కూడా ఆమె వ్రాసారు. ఈ ఫోటో ఏమిటంటే ఒక గుడి గోపురం.
దాని మీద చాలా మందే కనబడుతున్నారు. పైగా ఆ గోపురం మీద ఉన్న వ్యక్తులు చెప్పులతో, షూ తో గోపురం మీద నిలబడినట్టు కూర్చున్నట్లు ఉంది. అయితే చూడడానికి ఈ ఫోటో లో ఏ క్రియేటివిటీ లేదు. మరి ఉపాసన ఎందుకు షేర్ చేశారు అని మండిపడుతున్నారు. ఆ ఫోటో కి నెగెటివిటీ ఎక్కువగా వచ్చేసింది. అయినప్పటికీ ఆమె ఆ ఫోటోని తొలగించడం లేదు. ఆ ఫోటో ని వెంటనే డిలీట్ చేయమని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. విపరీతమైన ట్రోలింగ్ కూడా జరుగుతోంది.
ఇది ఇలా ఉంటే ఉపాసన భర్త మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఫ్యాన్స్ సినిమా ఎప్పుడొస్తుందా అని ఎంతో ఆసక్తి తో చూస్తున్నారు. కరోనా వలన సినిమా పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసినదే. అలానే ఆచార్య సినిమా లో కూడా రామ్ చరణ్ నటిస్తున్నారు. రెండు చిత్రాలు కూడా పాన్ ఇండియన్ సినిమాలే. మరి ఈ రెండు సినిమాలు చరణ్ ఇమేజ్ ని పెంచేస్తాయేమో చూడాలి.
End of Article