Home Filmy Adda తమన్ భైరవద్వీపం సినిమాకి పని చేసినప్పుడు ఎంత జీతం ఇచ్చారో తెలుసా..?

తమన్ భైరవద్వీపం సినిమాకి పని చేసినప్పుడు ఎంత జీతం ఇచ్చారో తెలుసా..?

by Megha Varna

సంగీత దర్శకుడు తమన్ అందరికీ సుపరిచితమే. ఎంతో అద్భుతమైన మ్యూజిక్ ని ఇచ్చి బాగా ఫేమస్ అయిపోయాడు తమన్. అల్లు అర్జున్ అల వైకుంఠ పురం సినిమా తో తమన్ క్రేజ్ మరింత పెరిగింది. అలానే అల వైకుంఠపురం లో సినిమాతో రికార్డులను కూడా బ్రేక్ చేశాడు తమన్. అఖండ సినిమాకి కూడా మంచి సంగీతాన్నిచ్చాడు తమన్. తాజాగా తమన్ ఆలీతో సరదాగా టాక్ షోలో పాల్గొని ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు.

మరి తమన్ షేర్ చేసుకున్న ఆ విషయాలు ఏమిటో ఇప్పుడే చూద్దాం. అయితే ప్లాప్ వచ్చినా సక్సస్ వచ్చినా దాని నుంచి నేను ఎంతో నేర్చుకుంటాను అని చెప్పాడు తమన్. అలానే తన పాస్ట్ గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తను చేసిన మొదటి సినిమా బైరవద్వీపం అని.

ఆ సినిమా లో డ్రమ్మర్ గా పని చేశానని చెప్పాడు. అయితే అప్పుడు తమన్ కి ఎంత శాలరీ ఇచ్చారో తెలుసా..? భైరవద్వీపం సినిమా లో డ్రమ్మర్ కింద పనిచేస్తున్న రోజుల్లో తమన్ కి 30 వేల రూపాయలను జీతంగా ఇచ్చారట. అయితే ఇప్పుడు అదే బాలకృష్ణ సినిమాకు సంగీత దర్శకుడిగా పని చేయడం ఆనందంగా ఉందని చెప్పాడు. అలానే అఖండ మ్యూజిక్ బాగుందని బాలకృష్ణ ప్రశంసించారని చెప్పాడు.

అదే విధంగా అప్పట్లో వచ్చిన బాయ్స్ సినిమాలో చిన్న పాత్ర చేశానని చెప్పాడు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ తో శంకర్ సినిమా తీస్తున్నారని ఆ సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నానని… ఒకప్పుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ లో చిన్న పాత్ర చేసి ఇప్పుడు మ్యూజిక్ ఇస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందని ఎంతో గర్వ పడుతున్నానని తమన్ అన్నాడు.

https://m.facebook.com/story.php?story_fbid=3194400850886198&id=1731907063802258&sfnsn=wiwspwa

You may also like