Home Filmy Adda “సినిమాల ద్వారా ప్రజలకు చెప్పాల్సింది ఇది కాదు.!” అంటూ… “సమంత”కి ఒక నెటిజన్ రిక్వెస్ట్..!

“సినిమాల ద్వారా ప్రజలకు చెప్పాల్సింది ఇది కాదు.!” అంటూ… “సమంత”కి ఒక నెటిజన్ రిక్వెస్ట్..!

by Mohana Priya

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో సమంత ఒకరు. తన సినిమాలకు సంబంధించిన విషయాలను కానీ, లేదా ఇతర విషయాలను కానీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.

అలాగే చాలా సార్లు తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమంత సోషల్ మీడియా ద్వారా సమాధానం చెప్పారు. ఇవన్నీ మాత్రమే కాకుండా ఎంతో మందిని ప్రోత్సహించేలాగా కూడా సమంత పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇటీవల సమంత పుష్పలో చేసిన ఊ అంటావా పాటకి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో విపరీతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఒక ఇంటర్వ్యూలో సమంత ఇచ్చిన ఆన్సర్ కి, ఒక నెటిజన్ ఇచ్చిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

samantha answer about 2021 in film companion interview

ఓ బేబీ సినిమా సమయంలో సమంత ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఇంటర్వ్యూ చేసే వ్యక్తి, “ఈ కాలంలో అమ్మాయిలు పెళ్లయిన తర్వాత తమ భర్తలు ఏదైనా తప్పు చేశారు అనిపిస్తే అది తప్పు అని డైరెక్ట్ గా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో మీరు మజిలీ సినిమాలో మీరు పోషించిన పాత్ర ఎలా ఎంచుకున్నారు?” అని అడిగారు. అందుకు సమంత, “ఒక మ్యారేజ్ నిలబడాలి అంటే వారిద్దరూ కాంప్రమైజ్ అవ్వడం అనేది చాలా ముఖ్యం” అని చెప్పారు. అయితే సమంత తాను పోషించిన శ్రావణి పాత్ర చాలా స్ట్రాంగ్ అని అన్నారు.

netizen reply on a samantha interview goes viral

ఈ విషయంపై ఒక నెటిజన్ మాట్లాడుతూ, “హింస అంటే కేవలం కొట్టడంలోనే కాదు. ఇలా మానసికంగా హింసించడం కూడా హింస కిందకే వస్తుంది. ఈ సినిమాలో మీరు పోషించిన శ్రావణి పాత్ర క్లైమాక్స్ లో తప్ప ఎక్కడ కూడా స్ట్రాంగ్ గా ఉన్నట్టు చూపించలేదు. సినిమాల ద్వారా ప్రేక్షకులకి ఏదైనా ఒక సందేశం ఇచ్చే విధానం ఇది అయితే కాదు. అది కూడా ముఖ్యంగా మన రాష్ట్రాల్లో యువతరం మీద ఇలాంటి సినిమాల ప్రభావం చాలా వరకు ఉంటుంది. కాబట్టి ఇక మీదట అయినా మీరు పోషించే పాత్రలని జాగ్రత్తగా చూసి ఎంచుకోండి.”

times of india whatsapp chat with samantha about divorce

“అది కూడా ఎవరో ఇప్పుడే వస్తున్న నటి కాకుండా ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న సమంత లాంటి ఒక పెద్ద స్టార్ ఇలాంటి పాత్రలు ఎంచుకుంటే ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మీరు ఎంచుకునే పాత్ర భవిష్యత్తులో కూడా చాలామందిపై మంచి ప్రభావం చూపాలి అని ఒక బాధ్యతతో ఎంచుకోవాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను” అని రాశారు. అలాగే, “కాంప్రమైజ్ అనేది ఇద్దరు వైపులనుండి ఉండాలి అని, అవతలి వాళ్ళు మాట్లాడకపోయినా వారు ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోవాలి అనే వేదాంతం ఇవ్వడం ఆపండి” అని అన్నారు.

watch video :

You may also like