Ads
ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్ లో రాధే శ్యామ్ సినిమా రాబోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాధే శ్యామ్ గురించి అభిమానులు దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Video Advertisement
రాధే శ్యామ్ ఓ వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించనున్నారు. అలా అని ఇది బయోపిక్ కాదు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. కృష్ణం రాజు సమర్పణలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ప్రమోద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇటీవల విడుదలైన రాధే శ్యామ్ టీజర్, పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల ఆసక్తిని ఇంకా పెంచాయి. కొంత మంది సినిమా పునర్జన్మ నేపథ్యంలో సాగుతుంది అంటూ ఉంటే, కొంత మంది మాత్రం అలా ఏమీ లేదు అని అంటున్నారు. మరి అసలు రాధే శ్యామ్ కథ ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. అయితే జనవరిలో విడుదల అవ్వాల్సిన రాధే శ్యామ్ సినిమా వాయిదా పడి మార్చ్ లో విడుదల అవ్వబోతోంది. దాంతో సినిమా బృందమంతా సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ చర్చలో ఉన్నారు. ఇలా ఉండగా రాధే శ్యామ్ సెన్సార్ విడుదల అయ్యింది.
సెన్సార్ వాళ్ళు సినిమా చూసిన తర్వాత ఇలా అన్నారు అంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో రాసిన దాని ప్రకారం, సెన్సార్ బోర్డ్ వాళ్ళు ఈ సినిమా చూసి, “రాధే శ్యామ్ ప్రభాస్ కెరీర్లో ఒక బెస్ట్ సినిమా” అని చెప్పారట. సినిమాలో ఉండే ట్విస్ట్లు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు అని, అవి అన్నీ జనాలకి కొంచెం షాకింగ్ గా అనిపిస్తాయి అని అన్నారు. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్, షిప్ సీన్ సినిమాకి ఒక పెద్ద హైలైట్గా నిలుస్తాయి అని అన్నారు. సినిమా రిజల్ట్ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు అని, సినిమా కచ్చితంగా బ్లాక్బస్టర్ అని అన్నారట.
https://www.instagram.com/p/CYdhoA4vn0A/?utm_medium=copy_link
End of Article