“పుష్ప”లో అంత పవర్ ఫుల్ పాటని… కామెడీ సీన్‌తో సింక్ చేసారుగా..? ఈ వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..!

“పుష్ప”లో అంత పవర్ ఫుల్ పాటని… కామెడీ సీన్‌తో సింక్ చేసారుగా..? ఈ వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..!

by Mohana Priya

Ads

ఎంతో కాలం వెయిట్ చేసిన తర్వాత డిసెంబర్‌లో పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది.

Video Advertisement

దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు. అయితే, పుష్ప సినిమా టాక్ మాత్రం మిక్స్డ్ గానే వస్తోంది. పుష్ప సినిమా థియేటర్లలో నడుస్తుండగానే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. హిందీ వెర్షన్ తో సహా అన్ని భాషల్లో సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.

pushpa inspired from a famous spanish series

పుష్ప సినిమా ద్వారా కేవలం సౌత్‌లో మాత్రమే కాకుండా నార్త్‌లో కూడా అల్లు అర్జున్ చాలా పాపులర్ అయ్యారు. అంతకు ముందు నుండి అల్లు అర్జున్ చాలా ఫేమస్. కానీ పుష్పతో నార్త్‌లో కూడా అల్లు అర్జున్ ఒక ఇమేజ్ సంపాదించారు. ఎంతో మంది ప్రముఖులు సినిమా చూసి, సినిమా చాలా బాగుంది అని, అల్లు అర్జున్ ఈ సినిమాలో చాలా బాగా నటించారు అని సోషల్ మీడియా ద్వారా పొగుడుతున్నారు.

pushpa ey bidda song edit with a comedy scene

అయితే ఈ సినిమా హిట్ అవడానికి మ్యూజిక్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో ఏ బిడ్డ పాటలో ఎవడ్రా ఎవడ్రా నువ్వు అని ఒక లైన్ వస్తుంది. ఆ లైన్ కి అతడే ఒక సైన్యం సినిమాలో ఎమ్మెస్ నారాయణ సునీల్ కి మధ్య వచ్చే ఒక సీన్ వీడియో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ సినిమాలో ఎమ్మెస్ నారాయణ సునీల్ నువ్వు ఎవరు అని అడుగుతూ ఉంటారు. ఆ వీడియో కి ఈ పాట వీడియో సింక్ చేసి షేర్ చేశారు. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.

watch video :


End of Article

You may also like