Home Filmy Adda Sehari Review : “హర్ష్” హీరోగా పరిచయమైన సెహరి హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Sehari Review : “హర్ష్” హీరోగా పరిచయమైన సెహరి హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya
  • చిత్రం : సెహరి
  • నటీనటులు : హర్ష్ కనుమిల్లి, సిమ్రన్ చౌదరి, అభినవ్ గోమటం.
  • నిర్మాత : అద్వయ జిష్ణు రెడ్డి
  • దర్శకత్వం : జ్ఞానసాగర్ ద్వారక
  • సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి
  • విడుదల తేదీ : ఫిబ్రవరి 11, 2021

స్టోరీ :

వరుణ్ (హర్ష్ ) బ్రేకప్ అయిన బాధలో ఉంటాడు. లవ్ అలాంటివి ఏమీ వద్దు అని, ఇంకా డైరెక్ట్ గా పెళ్లి చేసుకుందాం అని డిసైడ్ అవుతాడు. అలాంటి సమయంలో వరుణ్ కి సిమ్రన్ పరిచయం అవుతుంది. సిమ్రన్ తో ప్రేమలో పడతాడు వరుణ్. తీరా చూస్తే, సిమ్రన్ వరుణ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వాళ్ళ అక్క అని తెలుస్తుంది. తర్వాత వరుణ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? సిమ్రన్, వరుణ్ ప్రేమ గెలిచిందా? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

sehari movie review

 

రివ్యూ :

సినిమా ట్రైలర్ చూస్తే ఒక ప్రేమ కథ అని అర్థమైపోతుంది. స్టోరీ లైన్ కూడా దాదాపు తెలిసిపోతుంది. సినిమా కథ మొత్తం మనకి ట్రైలర్‌లో తెలిసిపోతుంది అని అనుకున్నా కూడా సినిమా బోర్ కొట్టకుండా నడిపించారు. కామెడీతో సరదాగా సాగుతుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే హర్ష్ బాగా నటించారు. ఈ సినిమాకి స్టోరీ కూడా అందించారు. అలాగే హీరోయిన్ పాత్రలో నటించిన సిమ్రన్ కూడా బాగా చేశారు. ఈ సినిమాతో సంగీత దర్శకులు కోటి నటుడిగా అడుగు పెట్టారు. ఒక ముఖ్య పాత్రలో నటించిన నటించిన అభినవ్ గోమటం కామెడీ కూడా బాగుంది. సినిమా స్టోరీ మామూలుగా ఉన్నా కూడా టేకింగ్ వల్ల ఎక్కడా బోర్ కొట్టదు.

sehari movie review

ప్లస్ పాయింట్స్ :

  • కామెడీ
  • పాటలు
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

  • అక్కడక్కడా ఫ్లాట్ గా నడిచే కొన్ని సీన్స్

రేటింగ్ :

2.5/5

ట్యాగ్ లైన్ :

వీకెండ్ కి సరదాగా ఏదైనా ఫీల్ గుడ్ సినిమా చూద్దామా అనుకుంటే సెహరి తప్పకుండా నిరాశ పరచదు.

You may also like