ఇదేంటి ఇలా జరిగింది..? “భీమ్లా నాయక్” ఫస్ట్ రివ్యూ..! సినిమా గురించి ఏం చెప్పారంటే..?

ఇదేంటి ఇలా జరిగింది..? “భీమ్లా నాయక్” ఫస్ట్ రివ్యూ..! సినిమా గురించి ఏం చెప్పారంటే..?

by Mohana Priya

Ads

గత సంవత్సరం వకీల్ సాబ్ తో ఇన్నింగ్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వచ్చే సంవత్సరం వరుస సినిమాలతో మన ముందుకు రాబోతున్నారు. ఆ సినిమాల్లో మొట్టమొదటిగా విడుదల అవుతోంది భీమ్లా నాయక్. ఈ సినిమా మలయాళం సినిమా అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ కి రీమేక్‌గా రూపొందించబడింది.

Video Advertisement

ఇందులో రానా దగ్గుబాటి కూడా మరొకరు నటిస్తున్నారు. నిత్యా మీనన్ పవన్ కళ్యాణ్‌కి జోడిగా నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించడం ఇదే మొదటిసారి. ఈ సినిమాకి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకి మాటలు రాస్తున్నారు.

bheemla nayak first review by umair sandhu

భీమ్లా నాయక్ సినిమా విడుదల కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల చాలా సార్లు వాయిదా పడింది. ఇప్పుడు కూడా సినిమా విడుదల మళ్లీ వాయిదా పడింది. కానీ సినిమా సెన్సార్ రిపోర్ట్ మాత్రం వచ్చేసింది. ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు సోషల్ మీడియాలో ఈ సినిమా రివ్యూ ఇచ్చారు. ఉమైర్ సంధు ఈ విధంగా రాసారు. “భీమ్లా నాయక్ ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ టెస్ట్ పాస్ అయింది. పవన్ కళ్యాణ్ అద్భుతమైన ఫార్మ్‌లో ఉన్నారు. సినిమా డౌట్ లేకుండా హిట్ అవుతుంది” అని అన్నారు.

bheemla nayak first review by umair sandhu

అలాగే, “నా మాటలని గుర్తు పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ కి ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఆయనకి మళ్ళీ ఆ స్టార్ డమ్ వచ్చేసింది” అని అన్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన విడుదల అవ్వబోతోంది. అయితే, ఉమైర్ సంధు అంతకుముందు చాలా సినిమాలకి రివ్యూలు ఇచ్చారు. పాజిటివ్‌గా ఇచ్చిన రివ్యూస్ అన్నీ విడుదలైన తర్వాత టాక్ చూస్తే వేరేగా వచ్చింది. దాంతో ఈ సినిమా టాక్ గురించి కూడా అభిమానులు కొంత ఆందోళనకు గురవుతున్నారు. మరి సినిమా ఎలా ఉండబోతోందో తెలియాలి అంటే విడుదల అయ్యేంతవరకు ఆగాల్సిందే.


End of Article

You may also like