Ads
మనం సినిమా నచ్చితే ఏ భాషలో అయినా సరే ఒకేలాగా ఆదరిస్తాం. అందుకే మన భాషలోని సినిమాలు వేరే భాషల్లోకి, వేరే భాషల సినిమాలు మన భాషలోకి డబ్ చేస్తూ ఉంటారు. తెలుగులోకి డబ్ అయ్యే సినిమాలు ఎక్కువగా తమిళ్ భాష నుంచి అవుతాయి.
Video Advertisement
తమిళ్ హీరోలు అయిన సూర్య, విక్రమ్, అజిత్, విజయ్, కార్తీ, విశాల్ వీళ్ళందరికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా క్రేజ్ ఉంది. వాళ్ళ సినిమాలు తెలుగులోకి డబ్ అవ్వకపోయినా కూడా తమిళ్ లో పాటలు ఏమైనా రిలీజ్ అయినా కూడా మన తెలుగు వాళ్ళు కచ్చితంగా చూస్తారు. అలా ఇటీవల విజయ్ హీరోగా నటించిన బీస్ట్ సినిమాలో ఒక పాట విడుదల అయ్యింది.
ఆ పాట తమిళ్ లో ఉన్నా కూడా భారతదేశం అంతటా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటని అనిరుధ్ కంపోజ్ చేశారు. ఈ పాటకి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. పాటలో విజయ్ తో పాటు హీరోయిన్ పూజా హెగ్డే కూడా కనిపిస్తున్నారు. అయితే ఈ పాటలో ఒక స్టెప్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమాలోని స్టెప్ కి దగ్గరగా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో సామీ సామీ పాటలో దగ్గర దగ్గర ఇలాంటి స్టెప్ ఒకటి ఉంటుంది.
మొత్తం ఒకటే లాగ కాకపోయినా దాదాపు అల్లు అర్జున్ వేసిన స్టెప్, విజయ్ వేసిన స్టెప్ సడన్ గా చూస్తే ఒకేలాగా అనిపిస్తాయి. దాంతో సోషల్ మీడియాలో 2 పాటల స్టెప్ వీడియోలని పక్కపక్కన పెట్టి ఎడిట్ చేసి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఒక్క పాట మాత్రమే కాదు బీస్ట్ పాటలోని హుక్ స్టెప్ మరొక సూపర్ హిట్ పాట కూడా ఈ పాట లోని స్టెప్ కి దగ్గరగా ఉంది. అది కూడా మరొక తమిళ్ సినిమానే. అది కూడా ఇటీవలే విడుదలయ్యింది.
watch video :
https://youtu.be/lxu4nCDdUbk
ఇది మాత్రమే కాకుండా తమిళ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన డాక్టర్ సినిమాలోని చెల్లమ్మా పాట స్టెప్ కూడా ఇందుకు దగ్గరగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ రెండు పాటలకి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. దాంతో, “ఒకటి కాదు ఈ పాటలోని స్టెప్ రెండు పాటలకి దగ్గరగా ఉంది” అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
watch video :
End of Article