“వేదం” సినిమాలో “కర్పూరం” పాత్ర వెనకాల… ఇంత పెద్ద కథ ఉందా..?

“వేదం” సినిమాలో “కర్పూరం” పాత్ర వెనకాల… ఇంత పెద్ద కథ ఉందా..?

by Mohana Priya

Ads

నటులు అన్న తర్వాత అన్నీ రకాల సినిమాలూ చేయాలి. ప్రతి నటుడు కూడా అలా ఎన్నో సినిమాలు చేసి, అవి వారికి సూట్ అవుతాయా లేదా అనేది నిర్ణయించుకుంటారు. ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలు కూడా అలా అంతకుముందు తమ ఇమేజ్‌ని పక్కన పెట్టి ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలని చేసారు.

Video Advertisement

ఇప్పుడు కూడా సినిమా సినిమాకి ఎదో ఒక కొత్తదనం చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలా అల్లు అర్జున్ కూడా తన కెరీర్‌లో ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేసారు. వాటిలో ముందు వరసలో ఉంటే సినిమా వేదం. ఈ సినిమా కొంత మంది సాధారణ వ్యక్తులు ఎదుర్కొనే సమస్యల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు.

 

ఇందులో కేబుల్ రాజుగా అల్లు అర్జున్ నటించారు. అలాగే అనుష్క నటించిన సరోజ పాత్రకి కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఇందులో మరో హీరోగా మంచు మనోజ్ నటించారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా, చాలా మంది ఈ సినిమాలో నటించిన వారి నటనని, అలాగే ఇలాంటి కథని ఏంచుకున్నందుకు క్రిష్ ని ప్రశంసించారు. ఈ సినిమాలో అనుష్క పోషించిన సరోజ పాత్రతో మరో వ్యక్తి కూడా ఉంటారు. తనే కర్పూరం.

story behind karpuram character in vedam

సరోజ వేరే ఊరికి వెళ్లి, ఇవన్నీ వదిలేసి వేరే జీవితం చూసుకుందాం అని నిర్ణయించుకున్నప్పుడు కర్పూరం పాత్ర సరోజకి సపోర్ట్ చేస్తుంది. ఈ పాత్ర పోషించిన వ్యక్తి పేరు నిక్కి. నిక్కీ అనుష్క పర్సనల్ మేకప్ స్టాఫ్. అసలు నిజానికి ఈ పాత్ర క్రిష్ చేయాలి. కాని క్రిష్ వాళ్ళ తల్లి ఒప్పుకోలేదు. దాంతో ఆ సమయంలో అనుష్క నిక్కి పేరు సజెస్ట్ చేసారు. అలాగే నిక్కి చేసిన ఒక డాన్స్ వీడియో కూడా క్రిష్ కి చూపించారు. దాంతో ఈ పాత్రకి నిక్కిని ఎంపిక చేసారు క్రిష్.


End of Article

You may also like