Home Filmy Adda “ముందు దానికి అర్ధం తెలుసుకో..!” అంటూ… నెటిజెన్‌కి “సమంత” స్ట్రాంగ్ కౌంటర్..! ఏం అడిగారంటే..?

“ముందు దానికి అర్ధం తెలుసుకో..!” అంటూ… నెటిజెన్‌కి “సమంత” స్ట్రాంగ్ కౌంటర్..! ఏం అడిగారంటే..?

by Mohana Priya

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో సమంత ఒకరు. తన సినిమాలకు సంబంధించిన విషయాలను కానీ, లేదా ఇతర విషయాలను కానీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.

అలాగే చాలా సార్లు తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమంత సోషల్ మీడియా ద్వారా సమాధానం చెప్పారు. ఇవన్నీ మాత్రమే కాకుండా ఎంతో మందిని ప్రోత్సహించేలాగా కూడా సమంత పోస్ట్ చేస్తూ ఉంటారు.

netizens recalling samantha tweet on 1 nenokkadine poster

ప్రస్తుతం సమంత వరుస సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. అలాగే సమంత హీరోయిన్‌గా నటించిన శాకుంతలం సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇటీవల విడుదల అయింది. ఈ సందర్బంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకి సమంత సమాధానాలు చెప్పారు. కొంత మంది శాకుంతలం సినిమాలో సమంత లుక్ బాగుంది అని కామెంట్ చేసారు. మరి కొంతమంది సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు.

samantha strong counter to a netizen on instagram

వారిలో ఒకరు సరైన పద్ధతిలో కామెంట్ చేయలేదు. ఈ ప్రశ్నకి కూడా సమంత తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చారు. “ముందు ఆ పదం ఎలా వాడాలో తెలుసుకో” అంటూ కామెంట్ చేశారు సమంత. అలాగే సమంత ఇంకా చాలా మంది నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ప్రస్తుతం సమంత యశోద అనే సినిమా షూటింగ్‌లో ఉన్నారు. అలాగే మరి కొన్ని సినిమాలు కూడా డిస్కషన్ దశలో ఉన్నాయి. వీటిలో యశోద సినిమా పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అవుతుంది. ఇందులో సమంత ఒక జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తారు అని సమాచారం. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

You may also like