హైదరాబాద్ అబ్బాయి, “ఉక్రెయిన్” అమ్మాయి వివాహం..! కానీ ట్విస్ట్ ఏంటంటే..?

హైదరాబాద్ అబ్బాయి, “ఉక్రెయిన్” అమ్మాయి వివాహం..! కానీ ట్విస్ట్ ఏంటంటే..?

by Mohana Priya

Ads

ప్రస్తుతం ఉక్రెయిన్‌లో గొడవలు జరుగుతున్నాయి.రష్యా దాడికి తెగబడడంతో ఉక్రెయిన్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ప్రాణాలు అరచేత పట్టుకుని అక్కడి ప్రజలు చాలా ఇబ్బందికి గురి అవుతున్నారు.

Video Advertisement

రష్యా అధ్యక్షుడు పశ్చిమ మరియు ఉక్రెయిన్‌ లు నాటోలో చేరబోమని మరియు ఉక్రెయిన్ సైనికరహితం చేసి తటస్థ రాజ్యంగా మారాలని హామీలు కోరుతున్నారు. ఈ విషయమై ఉక్రెయిన్ వెనక్కి తగ్గడంతో ఇరు ప్రాంతాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కడ చాలా మంది భారతీయులు కూడా చిక్కుకుపోయారు.

hyderabadi boy got married to an ukrainian girl

కొంత మంది ఎలాగోలా కష్టపడి భారతదేశానికి వచ్చినా కూడా కొంత మంది మాత్రం అక్కడే ఉండిపోయారు. అలా హైదరాబాద్‌కి చెందిన ఒక అబ్బాయి ఉక్రెయిన్‌కి చెందిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వారి పెళ్లి కూడా దాడికి ఒక్కరోజు ముందే జరిగింది. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్‌కి చెందిన ప్రతీక్ అనే ఒక అబ్బాయి ఉక్రెయిన్ సిటిజన్ అయిన లియుబోవ్‌ అనే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారి పెళ్లి ఫిబ్రవరి 23వ తేదీన జరిగింది. కానీ హైదరాబాద్‌లో రిసెప్షన్‌ కోసం వారిద్దరూ హైదరాబాద్‌కి వచ్చేశారు.

hyderabadi boy got married to an ukrainian girl

వారిద్దరి రిసెప్షన్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ రిసెప్షన్‌కి చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు అయిన రంగరాజన్ గారు అతిథిగా వచ్చి ఆ జంటను ఆశీర్వదించారు. ఈ క్రమంలో ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రంగరాజన్ గారు మాట్లాడుతూ,”ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు తీసుకొచ్చింది. కోవిడ్ ప్రభావం కూడా మరింత పెంచింది. దీనివల్ల ప్రపంచం ఇంకా ఇబ్బందులను ఎదుర్కొంటోంది” అని అన్నారు.

watch video :


End of Article

You may also like