Home Filmy Adda మెగాస్టార్ “గాడ్ ఫాదర్”తో పాటు… తెలుగులోకి రీమేక్ అవ్వబోతున్న 10 “మలయాళం” సినిమాలు..!

మెగాస్టార్ “గాడ్ ఫాదర్”తో పాటు… తెలుగులోకి రీమేక్ అవ్వబోతున్న 10 “మలయాళం” సినిమాలు..!

by Mohana Priya

ఏ ఇండస్ట్రీలో అయినా సరే రీమేక్ అనేది ఒక ట్రెండ్ అయిపోయింది. మన సినిమాలని వేరే భాషల్లో రీమేక్ చేస్తున్నారు. వేరే ఇండస్ట్రీ సినిమాలని కూడా తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. అయితే చాలా వరకు సినిమాలు తమ భాషలతో పాటు తెలుగులో కూడా విడుదల అవుతున్నాయి. కొన్ని మాత్రం అవ్వట్లేదు. అలాంటి సినిమాలని రీమేక్ చేస్తున్నారు.

వీటిలో చాలా వరకు మలయాళం సినిమాలు ఉంటున్నాయి. ఇప్పుడు చాలా మలయాళం సినిమాలు తెలుగులో రీమేక్ అవుతున్నాయి. అలా తెలుగులో రీమేక్ అవుతున్న మలయాళం సినిమాలు ఏవో, అందులో ఎవరు నటిస్తున్నారో ఇప్పుడు చూద్దాం.

#1 లూసిఫర్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమా రీమేక్. తెలుగు రీమేక్ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నయనతార కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

upcoming malayalam remakes in tollywood

#2 కప్పేల

ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో అనిఖా సురేంద్రన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ, అలాగే ఖైదీ, మాస్టర్ సినిమాలతో సుపరిచితులైన అర్జున్ దాస్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

upcoming malayalam remakes in tollywood

#3 డ్రైవింగ్ లైసెన్స్

ఈ సినిమాని కూడా తెలుగులో రీమేక్ చేస్తున్నారు అని సమాచారం. ఇందులో వెంకటేష్, రామ్ చరణ్ కలిసి నటిస్తారు అనే వార్త అయితే ప్రచారం అయ్యింది.

upcoming malayalam remakes in tollywood

#4 హెలెన్

ఈ సినిమా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

upcoming malayalam remakes in tollywood

#5 పాదయోత్తం

సుమంత్ హీరోగా నటిస్తున్న అనగనగా ఒక రౌడీ సినిమా ఈ సినిమా రీమేక్ అని సమాచారం.

upcoming malayalam remakes in tollywood

#6 బ్రో డాడీ

ఈ సినిమాను కూడా తెలుగులో రీమేక్ చేస్తున్నారు అనే వార్తలు వచ్చాయి. ఇందులో వెంకటేష్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తారు అనే వార్త వచ్చింది.

upcoming malayalam remakes in tollywood

#7 ద గ్రేట్ ఇండియన్ కిచెన్

ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఇందులో ఐశ్వర్య రాజేష్, రాహుల్ రవీంద్రన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

upcoming malayalam remakes in tollywood

#8 తీవండి

మలయాళంలో టోవినో థామస్ హీరోగా నటించిన ఈ సినిమాని కూడా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. కానీ ఈ సినిమాకి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.

upcoming malayalam remakes in tollywood

#9 జోసెఫ్

ఈ సినిమాని శేఖర్ పేరుతో తెలుగులో రీమేక్ చేసారు. ఇందులో రాజశేఖర్ హీరోగా నటించారు.

upcoming malayalam remakes in tollywood

#10 నయట్టు

ఈ సినిమాని కూడా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో అంజలి హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే ప్రియదర్శి కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల లాంచ్ అయ్యింది.

upcoming malayalam remakes in tollywood

You may also like