Ads
ప్రతి గురువారం, శుక్రవారం మనల్నందరిని అలరిస్తున్న ప్రోగ్రామ్స్ జబర్దస్త్ ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా జనాల్లోకి స్ప్రెడ్ అవుతూ, ఇప్పుడు టాప్ షోస్ గా నిలిచాయి.ఈ రెండు ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు మన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
Video Advertisement
ఒక రోజు జబర్దస్త్ లో అనసూయ యాంకర్ గా మనల్ని అలరిస్తుంటే, మరొక రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ లో రష్మీ యాంకర్ గా మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఎక్సట్రా జబర్దస్త్ షో ద్వారా పరిచయం అయిన సుడిగాలి సుధీర్ తన స్కిట్స్ తో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఎంటర్టైన్ చేశారు.
అంతే కాదు జబర్దస్త్ స్టేజి ఎందరినో ఆర్టిస్టులుగా తీర్చి దిద్దింది.. జబర్దస్త్ నుంచి సినిమాల వరకు ఫేమస్ అయ్యారు అక్కడ కూడా కమెడియన్స్ గా ఇప్పటికీ రాణిస్తున్నారు. కొందరు జబర్దస్త్ ని వదిలివెళ్ళిపోయినప్పటికీ సుడిగాలి సుధీర్ మాత్రం ఇంకా ఇక్కడే ఉంటూ తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సుధీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే సుదీర్ కేవలం జబర్దస్త్ లో మాత్రమే కాకుండా వేరే ప్రోగ్రామ్స్ లో కూడా కనిపిస్తూ ఉంటారు. తన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. సుధీర్ గత కొంత కాలం నుండి సినిమాల్లో హీరోగా, ముఖ్య పాత్రల్లో కూడా నటిస్తున్నారు.
సుధీర్, రష్మికి మధ్య వచ్చే కామెడీ కూడా ప్రేక్షకులకి చాలా బాగా నచ్చింది. అందుకే చాలా ప్రోగ్రామ్స్ లో ఇద్దరు కలిసి పాల్గొంటూ ఉంటారు. ఇదిలా ఉండగా సుధీర్ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో ఇటీవల విడుదల అయ్యింది. అందులో సుధీర్ కి, ఒక అమ్మాయికి ఎంగేజ్మెంట్ జరుగుతున్నట్లు చూపిస్తున్నారు. ఆ అమ్మాయిని ఇంతకుముందు ప్రోగ్రామ్స్ లో ఎక్కడా చూడలేదు. దాంతో సినిమారంగానికి చెందినవారు కాదు అని అర్థం అవుతోంది. ఇంక ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి అంటే ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయ్యేంత వరకు ఆగాల్సిందే.
watch video :
End of Article