Home Filmy Adda RRR క్లైమాక్స్ లీక్..! ఈ “ట్విస్ట్” అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదుగా..?

RRR క్లైమాక్స్ లీక్..! ఈ “ట్విస్ట్” అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదుగా..?

by Mohana Priya

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.

ఇటీవల ట్రైలర్ విడుదలయ్యి సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు స్నేహం, వారి కష్టాలు, వారు ఎలా కలిశారు, అసలు వారు ఎలా పెరిగారు, ఇలా చాలా అంశాలని ఈ ట్రైలర్‌లో చూపించారు. సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఈ విషయం చాలా మంది నిరాశకు గురి చేసింది.

rrr trailer analysis and hidden details

కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా సినిమా బృందం కూడా రిస్క్ తీసుకొని విడుదల చేయలేకపోతున్నారు. ఇంక పరిస్థితి అర్థం చేసుకున్న అభిమానులు కూడా చేసేదేమి లేక సినిమా విడుదల అయ్యే అంతవరకు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సినిమా మార్చ్ లో విడుదల అవుతుంది అని సినిమా బృందం ప్రకటించింది. సినిమా క్లైమాక్స్ ఇదే అంటూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో చివరికి జూనియర్ ఎన్టీఆర్ పోషించిన కొమరం భీమ్ పాత్ర, అలాగే రామ్ చరణ్ పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్ర అంగవైకల్యానికి గురవుతారట. అంటే అల్లూరి సీతారామరాజు పాత్రకి కాళ్లు, కొమరం భీమ్ పాత్రకి కళ్ళు పోతాయట.

rrr trailer analysis and hidden details

ఇది మాత్రమే కాకుండా క్లైమాక్స్ ఇదే అంటూ ఇంకొక వార్త కూడా నడుస్తోంది. వారిద్దరిలో ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతారు అనే వార్త కూడా ఒకటి వైరల్ అవుతోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్ కి మాత్రం ఇది జీర్ణించుకోవడం చాలా కష్టం. కానీ విజయేంద్రప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ప్రకారం అలాంటివన్నీ వార్తలు మాత్రమే. సినిమాలో హీరోలు ఇద్దరు కూడా చివరి వరకు మామూలుగానే ఉంటారు అని, ఎందుకంటే వేరే విధంగా ఎలా చేసినా కూడా ఫ్యాన్స్ ఊరుకోరు, వారిని నిరాశ పరచలేము అన్నారు.

You may also like