Ads
ఏదో ఒక కారణంతో కట్టుకున్న భార్యను వదిలేస్తూ ఉంటున్నారు. ఇటువంటివి మనం చాలానే చూశాం. తాజాగా ఒక భర్త తన భార్యను వదిలేశాడు. తనతో పాటు పిల్లలను కూడా ఆసుపత్రిలోనే వదిలేసి ఇంటికి కూడా రానివ్వలేదు. దీనికి గల కారణం ఏమిటంటే కొడుకు అంటే మహా ఇష్టం.
Video Advertisement
నిజానికి కొడుకు అంటే ఇష్టం ఉండొచ్చు కానీ మరీ ఇంత పిచ్చా..? వారసుడు ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కలలుకంటూ ఉంటారు. కానీ కొడుకు పుట్టకపోతే ఇలా చేస్తారా..? ఇంతకీ అసలు ఏమైంది అనేది చూస్తే..
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కి చెందిన శివ్పురికి చెందిన గోలూ జాతవ్ 2016 లో బసంతిని వివాహం చేసుకున్నాడు. ఇప్పటికే వీరికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. మగ పిల్లలు అంటే గోలు కి ఎంతో ఇష్టం. మూడవ సారి అయినా కొడుకు పుడతాడు ఏమో అని గోలూ జాతవ్ అనుకున్నాడు. కానీ మూడో సారి కూడా ఆడపిల్లకు జన్మనిచ్చింది ఆమె.
దీంతో ఆగ్రహంతో ఆసుపత్రిలోనే తల్లి, పిల్లల్ని వదిలేసి వెళ్లిపోయాడు భర్త. ఇంటికి కూడా వీళ్ళని రానివ్వలేదు. బసంతి కి అసలు ఏం చేయాలో తెలియక ముగ్గురు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఇది ఇలా ఉంటే గోలు మరొక ఆమెను వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు.
ఆమెకి ఇప్పటికే ఒక కొడుకు ఉన్నాడు. మగ పిల్లవాడు ఉన్న ఒక మహిళ తో పెళ్లికి సిద్ధం అయ్యాడు అని తన భార్యకి తెలిసి అత్తింటి వారిని, భర్తని కూడా ఎంతగానో వేడుకొంది. అయినా సరే వారు ఈమె మాట వినలేదు. దీంతో కలెక్టర్ ని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది బసంతి.
End of Article