“పరుచూరి వెంకటేశ్వర రావు” కి ఏమయ్యింది..? ఇలా మారిపోయారేంటి..? వైరల్ అవుతున్న ఫోటో.!

“పరుచూరి వెంకటేశ్వర రావు” కి ఏమయ్యింది..? ఇలా మారిపోయారేంటి..? వైరల్ అవుతున్న ఫోటో.!

by Mohana Priya

Ads

ఎన్నో సినిమాల్లో నటించి, అలాగే ఎన్నో సినిమాలకు డైలాగ్స్ కూడా అందించిన రచయిత పరుచూరి వెంకటేశ్వర రావు. పరుచూరి బ్రదర్స్ యాక్షన్ సినిమాలకు డైలాగ్స్ అందించడంలో ఎంతో పేరు సంపాదించారు. అలాగే వారిద్దరూ ఎన్నో సినిమాల్లో కూడా నటించారు.

Video Advertisement

వారిద్దరిలో ఒకరైన పరుచూరి వెంకటేశ్వర రావు కూడా చాలా సినిమాల్లో నటించారు. అయితే గత కొంత కాలం నుండి పరుచూరి వెంకటేశ్వర రావు ఎక్కువగా కనిపించడం లేదు. పరుచూరి గోపాలకృష్ణ మాత్రం యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ ఉంటారు.

paruchuri venkateswara rao latest picture goes viral

పరుచూరి వెంకటేశ్వర రావుకి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జీ పరుచూరి వెంకటేశ్వర రావుని కలిశారు.  ఈ ఫోటోని జయంత్ సి పరాన్జీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో పరుచూరి వెంకటేశ్వరరావు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఈ ఫోటోని షేర్ చేస్తూ జయంత్ సి పరాన్జీ, ” నా గురూజీ పరుచూరి వెంకటేశ్వర రావు గారిని కలిసాను. ఆయన వృద్ధాప్యాన్ని చూస్తే బాధ అనిపించింది. కానీ ఆయన మేధస్సు మాత్రం ఇంకా అంతే చురుగ్గా ఉంది.

paruchuri venkateswara rao latest picture goes viral

“పరుచూరి వెంకటేశ్వర రావు ఆయన సోదరుడు కలిసి 300 సినిమాలకు మాటలు రాశారు. అందులో దాదాపు 200 సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇలా చాలా గొప్ప ఘనత సాధించారు. లవ్ యు సర్.” అని రాశారు. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు మాత్రం, “పరుచూరి వెంకటేశ్వరరావు అలా అయిపోయారు?” అని అంటున్నారు. పరుచూరి బ్రదర్స్ ఇటీవల సైరా నరసింహారెడ్డి సినిమాకి డైలాగ్స్ అందించారు.

https://www.instagram.com/p/Ca9ttk1LfOh/?utm_source=ig_web_copy_link


End of Article

You may also like