Ads
దాదాపు 2 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ థియేటర్లలో విడుదల అయ్యింది. ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉన్న ఈ సినిమా కోవిడ్ కారణంగా వాయిదా పడి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా టాక్ మొదట చాలా మిక్స్‌డ్‌గా వచ్చింది.
Video Advertisement
హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ సరిగ్గా లేదు అని, చాలా స్లోగా ఉంది అని ఇలా చాలా కామెంట్స్ వచ్చాయి. కానీ లవ్ స్టోరీ అంటే సాధరణంగా చాలా స్లోగా ఉంటుంది. “ఇంత పెద్ద స్టార్ అయిన తర్వాత కూడా ప్రభాస్ లాంటి హీరో ఇలాంటి సినిమా చేయాలి అనుకోవడం చాలా గొప్ప విషయం. ఇలాంటి సినిమా చేయడానికి ధైర్యం కావాలి” అని చాలామంది అంటున్నారు.
దర్శకుడు రాధా కృష్ణ అంతకుముందు జిల్ సినిమా చేశారు. రెండవ సినిమా అయినా కూడా రాధా కృష్ణ ఇలాంటి సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశారు అని అంటున్నారు. అలాగే లొకేషన్స్ కూడా చాలా బాగా చూపించారు అని అన్నారు. ముఖ్యంగా ఇలా పామిస్ట్రీ మీద సినిమా రావడం చాలా అరుదుగా జరుగుతుంది. అయితే ఈ సినిమాలోని ఒక సీన్ అంతకు ముందు వచ్చిన ఒక సినిమాలోని ఒక సీన్ లాగా ఉంది.
ప్రభాస్ ట్రైన్ లో వెళుతున్నప్పుడు చాలా మంది గుర్తుపట్టి వారి గురించి చెప్పమని అడుగుతారు. అలా ప్రభాస్ వారిని చూసి వారు ఎలా ఉండబోతున్నారో, భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే విషయాలు చెప్తారు. ట్రైన్ ప్రమాదానికి గురి అవుతుంది అని ముందే కనిపెడతారు. ఇలాంటి సీన్ అంతకుముందు రిలాక్స్ అనే ఒక సినిమాలో ఉంది. రాధే శ్యామ్ సినిమా చూసిన తర్వాత ఈ సీన్ చూస్తే రెండు సీన్లు దాదాపు ఒకటేలాగా అనిపిస్తాయి. ప్రస్తుతం అయితే రాధే శ్యామ్ సినిమాకి మంచి టాక్ వస్తోంది.
watch video :
End of Article