Home Filmy Adda ఈ 3 “పూజా హెగ్డే” సినిమాల్లో ఈ కామన్ పాయింట్ గమనించారా..? హీరోతో అలాగే..?

ఈ 3 “పూజా హెగ్డే” సినిమాల్లో ఈ కామన్ పాయింట్ గమనించారా..? హీరోతో అలాగే..?

by Mohana Priya

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్స్‌లో ఒకరు పూజా హెగ్డే. ఇటీవల మోస్ట్ ఎలిజిలిబుల్ బ్యాచిలర్ సినిమాతో మరో హిట్ కొట్టి, ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే, రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న సర్కస్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

అలాగే మరి కొన్ని సినిమాలను కూడా పూజా హెగ్డే సైన్ చేసారు. అంతే కాకుండా తమిళంలో విజయ్ హీరోగా నటిస్తున్న బీస్ట్ సినిమాలో కూడా నటిస్తున్నారు. పూజా హెగ్డే తెలుగులో మొదటిగా నటించిన సినిమా ఒక లైలా కోసం. ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా నటించారు. ఈ సినిమా డీసెంట్ టాక్ తెచ్చుకుంది.

Heroines who acted with brothers

ఆ తర్వాత ముకుంద సినిమాలో నటించారు. ఈ సినిమాతో వరుణ్ తేజ్ హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత దువ్వాడ జగన్నాథంలో నటించిన పూజా హెగ్డే వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. దాదాపు ప్రతీ స్టార్ హీరో సినిమాలో పూజా హెగ్డే నటించారు. ప్రస్తుతం హిందీలో కూడా నటిస్తున్నారు. అయితే పూజా హెగ్డే నటించిన మూడు సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ఉంది. ఒక లైలా కోసం సినిమాలో పూజా హెగ్డే హీరోని ఒక యాక్సిడెంట్ అయినప్పుడు కలుస్తారు.

upcoming telugu singer did a small role in mukunda

అలాగే ముకుంద సినిమాలో కూడా హీరోకి దెబ్బలు తగిలినప్పుడు పూజా హెగ్డే మొదటిసారిగా హీరోని కలుస్తారు. ఇప్పుడు రాధే శ్యామ్ సినిమాలో కూడా హీరో కి దెబ్బలు తగిలి ఉన్నప్పుడు పూజా హెగ్డే హీరోని కలుస్తారు. కోఇన్సిడెన్స్ గా ఈ మూడు సినిమాల్లో పూజా హెగ్డే హీరోని కలవడం ఒకటే లాగా ఉంటుంది. ఈ మూడు సినిమాల్లో కూడా లవ్ స్టోరీ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

You may also like