Ads
ఇండియన్ సినిమా హిస్టరీ గురించి అందులోనూ ముఖ్యంగా తెలుగు సినిమా హిస్టరీ గురించి చెప్పాలంటే బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అని అనొచ్చు. అంతకు ముందు వరకు వేరే దేశం వాళ్ళకి ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమా మాత్రమే గుర్తొచ్చేది. కానీ బాహుబలి తెలుగు సినిమా స్థాయిని పెంచింది.
Video Advertisement
బాహుబలి సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అంతే కాకుండా అంతకు ముందు వరకు పాన్ ఇండియా సినిమా అంటే ఎప్పుడో ఒకసారి వచ్చేవి. కానీ బాహుబలి తర్వాత ఎన్నో పాన్ ఇండియన్ సినిమాలు వచ్చాయి. వస్తున్నాయి కూడా. ఒకరకంగా చెప్పాలి అంటే తమ కంటెంట్ ని ప్రపంచవ్యాప్తంగా ప్రజెంట్ చేయాలి అనుకునే ఫిలిం మేకర్స్ కి బాహుబలి ఒక ధైర్యం ఇచ్చింది.
ఈ సినిమాలో నటించిన వాళ్లందరికీ కూడా చాలా గుర్తింపు వచ్చింది. ఈ సినిమాకి మూడవ పార్ట్ ఉంటుందా అని ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల ఆర్ఆర్ ఆర్ ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళి మీడియాతో మాట్లాడారు. ఇందులో బాహుబలి టాపిక్ కూడా వచ్చింది. ఇందులో బాహుబలి మూడవ పార్ట్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
రాజమౌళి మాట్లాడుతూ బాహుబలి మూడవ పార్ట్ తీయాలి అని వాళ్లు అనుకుంటున్నట్లు చెప్పారు. ఇది బాహుబలి చుట్టూ జరిగే వాటి గురించి ఉంటుందట. అసలు బాహుబలి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? ఇంకా బాహుబలిని ఎవరైనా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారా? అలాగే ఇంకా చాలా విషయాలపై ఈ సినిమా ఉంటుందట. ఈ సినిమాకి సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అలాగే బాహుబలిని నిర్మించిన శోభు యార్లగడ్డ ఈ సినిమాని కూడా నిర్మించడానికి ఆసక్తి చూపారట.
watch video :
End of Article