Home Filmy Adda “రాధే శ్యామ్” సినిమా నెగిటివ్ టాక్‌ రావడానికి… 10 కారణాలు ఇవేనా..?

“రాధే శ్యామ్” సినిమా నెగిటివ్ టాక్‌ రావడానికి… 10 కారణాలు ఇవేనా..?

by Mohana Priya

దాదాపు 2 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ థియేటర్లలో విడుదల అయ్యింది. ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉన్న ఈ సినిమా కోవిడ్ కారణంగా వాయిదా పడి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా టాక్ మొద‌ట చాలా మిక్స్‌డ్‌గా వ‌చ్చింది.

అప్పటి సమయంలో ఇటలీ ఎలా ఉంటుందో అలాగే చూపించారు. ప్రభాస్, పూజా హెగ్డే వేర్వేరుగా చాలా బాగా నటించారు అనిపిస్తుంది. ప్రభాస్, పూజా హెగ్డే కాస్ట్యూమ్స్, గెటప్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ ఈ సినిమాలో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. వాటి వల్లే సినిమా టాక్ కొంచెం నెగిటివ్ గా వస్తోంది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

radhe shyam movie review

#1 హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అంత వర్కవుట్ అవ్వలేదు అనిపిస్తుంది. వారిద్దరినీ చూస్తున్నంత సేపు ఒక లవ్ స్టోరీలో హీరో హీరోయిన్ల మధ్య ఉండాల్సిన అంత కెమిస్ట్రీ లేదేమో అనిపిస్తుంది.

#2 అలాగే తెలుగు ఓవర్సీస్ వెర్షన్‌లో సత్యరాజ్ పాత్ర కనిపిస్తారు. కానీ తెలుగులో అదే ప్లేస్‌లో కృష్ణంరాజు గారు కనిపిస్తారు. “ఇదేంటి తెలుగు సినిమాలో కూడా ఇలాంటి మార్పులు చేయడం ఏంటి?” అని కామెంట్స్ వస్తున్నాయి.

mistake in radhe shyam release trailer

#3 ఇది ఒక లవ్ స్టోరీ. సాధారణ లవ్ స్టోరీ అంటే సినిమా చాలా స్లోగా నడుస్తుంది. కానీ కొన్ని సినిమాలు అలా ఉన్నా కూడా బాగుంటాయి. ప్రేక్షకులకి ఆసక్తి కలిగిస్తాయి. కానీ ఈ సినిమాలో మాత్రం ఫైట్స్ కూడా లేకపోవడంతో అక్కడక్కడా ప్రేక్షకులకి బోర్ కొడుతుంది.

changes in radhe shyam telugu and hindi versions

#4 ప్రభాస్ ఇమేజ్ కి సూటయ్యే కథ ఇది కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక టైంలో లవ్ స్టోరీ చేసినా బానే ఉంటుంది కానీ, ఇప్పుడు సినిమాలో లవ్ స్టొరీ తో పాటు ఇంకా చాలా అంశాలు ఉండాలి అని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

changes in radhe shyam telugu and hindi versions

#5 ఇది కేవలం తెలుగులో విడుదల అయితే వేరేగా ఉండేది. కానీ తెలుగుతో పాటు వేరే భాషల్లో కూడా విడుదల అయ్యింది. అలాంటప్పుడు “ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది. అసలు అంత బడ్జెట్ పెట్టినప్పుడు కొంచెం కథపై కూడా దృష్టి పెడితే బాగుండేది” అని అంటున్నారు. సినిమాలో హీరో ఇండియన్, అలాగే మిగిలిన వాళ్ళు కూడా ఇండియన్స్ ఉంటారు. అలాంటప్పుడు “కథ ఇండియాలో కాకుండా వేరే దేశంలో తీయాల్సిన అవసరం ఏంటి?” అనే కామెంట్స్ వచ్చాయి.

netizens decode radhe shyam two heartbeats poster

#6 అలాగే ప్రభాస్ హిందీలో చెప్పిన డబ్బింగ్ కూడా చాలా డల్ గా అనిపించింది అని అన్నారు. ఆ విషయంపై కూడా దృష్టి పెట్టాల్సింది అని కామెంట్స్ వచ్చాయి.

Unnoticed details in Radhe Shyam teaser

#7 సినిమాలో చాలా మంది పెద్దపెద్ద నటులు ఉన్నారు. జగపతి బాబు కూడా ఉన్నారు. ఫస్ట్ హాఫ్ లో సీన్స్ బాగానే ఉంటాయి. కాని సెకండ్ హాఫ్ లో మాత్రం ఎందుకు వస్తాయో అర్థం అవ్వదు. అలాగే ఇంకా చాలా మంది నటుల సీన్స్ కూడా ఎడిటింగ్ లో కట్ అయ్యాయి. వారి సీన్స్ కూడా సినిమాలో ఉంటే బాగుండేది అని అన్నారు.

actress in radhe shyam new trailer

#8 సినిమాకి క్లైమాక్స్ చాలా పెద్ద ప్లస్ పాయింట్ అన్నారు. కానీ క్లైమాక్స్ లో చాలా విషయాలు అర్థం అవ్వవు. అసలు అంత పెద్ద ప్రమాదం నుండి హీరో ఎలా తప్పించుకొని వస్తాడో అర్థం కాదు. గ్రాఫిక్స్ బాగున్నా కూడా లాజిక్ మిస్ అయ్యింది అని అన్నారు.

changes in radhe shyam telugu and hindi versions

#9 లవ్ స్టోరీ సినిమాలో పాటలు చాలా ముఖ్యం. జస్టిన్ ప్రభాకరన్ అందించిన పాటలు బాగున్నాయి. కానీ అవి ప్రేక్షకులకి అంత పెద్దగా ఎక్కలేదు. ఇప్పుడు చాలా సినిమాల విడుదలకు ముందే పాటలు విడుదల అయ్యి సూపర్ హిట్ అవుతున్నాయి. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకులకి ఇంకా ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమాకి పాటలు బాగున్నా కూడా ఎక్కువగా హిట్ అవకపోవడంతో పాటలు థియేటర్ లో వింటున్నప్పుడు చాలా సాధారణంగా అనిపించాయి.

radhe shyam review by umair sandhu

#10 ప్రభాస్ గెటప్ కూడా చాలా చోట్ల మారుతుంది. కొన్నిచోట్ల సన్నగా, కొన్నిచోట్ల వేరేగా కనిపిస్తూ ఉంటారు. దీనివల్ల సినిమా అంతా ఒక టైంలో జరుగుతోంది అనే పాయింట్ మిస్ అయ్యింది. మిగిలిన వాళ్ళందరూ ఒకటే లాగా ఉన్నా కూడా ప్రభాస్ లో మార్పులు ప్రేక్షకులకి అర్థం అవుతాయి.

radhe shyam movie review

ప్రస్తుతం అయితే రాధే శ్యామ్ హిట్ టాక్ తో థియేటర్లలో నడుస్తోంది.

You may also like