Home Filmy Adda RRR కొత్త పోస్టర్‌లో ఇది గమనించారా.? ఆ సీన్ గుర్తొచ్చింది.!

RRR కొత్త పోస్టర్‌లో ఇది గమనించారా.? ఆ సీన్ గుర్తొచ్చింది.!

by Mohana Priya

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.

ఇటీవల ట్రైలర్ విడుదలయ్యి సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు స్నేహం, వారి కష్టాలు, వారు ఎలా కలిశారు, అసలు వారు ఎలా పెరిగారు, ఇలా చాలా అంశాలని ఈ ట్రైలర్‌లో చూపించారు. సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఈ విషయం చాలా మంది నిరాశకు గురి చేసింది.

did you observe this in rrr new poster

ఈ సినిమా మార్చ్ లో విడుదల అవుతుంది అని సినిమా బృందం ప్రకటించింది. సినిమా బృందం అంతా ప్రమోషన్స్ పనిలో బిజీగా ఉంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ దుబాయ్‌లో జరగబోతోంది. ఈ ఈవెంట్‌కి సినిమా బృందం అంతా రాబోతున్నారు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ సినిమా బృందం ఒక పోస్టర్ విడుదల చేసింది. అందులో గమనిస్తే ఒక విషయం తెలుస్తోంది. అదేంటంటే ఆ పోస్టర్ మహాభారతం రిఫరెన్స్ తీసుకొని చేశారు.

did you observe this in rrr new poster

హీరోలు ఇద్దరిని చూస్తూ ఉంటే కృష్ణార్జునులు గుర్తొస్తున్నారు. ఇప్పుడు మాత్రమే కాదు అంతకు ముందు కూడా రాజమౌళి తన సినిమాల్లో చాలా సార్లు ఇతిహాసానికి సంబంధించిన రిఫరెన్స్ తీసుకున్నారు. ఇప్పుడు కూడా అలాగే మహాభారతాన్ని పోలి ఉండేలాగా ఈ పోస్టర్ డిజైన్ చేశారు. సినిమా బృందాన్ని ఇటీవల డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ చేశారు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

You may also like