Home Filmy Adda “సర్కారు వారి పాట” లేటెస్ట్ పోస్టర్ లో ఇది గమనించారా..? అదే గుర్తొచ్చింది కదా..?

“సర్కారు వారి పాట” లేటెస్ట్ పోస్టర్ లో ఇది గమనించారా..? అదే గుర్తొచ్చింది కదా..?

by Mohana Priya

సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాట టీజర్ ఇప్పటికే యూట్యూబ్‌లో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ టీజర్‌లో మహేష్ బాబు చాలా స్టైలిష్‌గా, డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమా మొదటి పాట ఫిబ్రవరి 14న విడుదల అవ్వబోతోంది.

ఈ సినిమాకి సోలో, గీతగోవిందం సినిమాలకు దర్శకత్వం వహించిన పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్‌లో మహేష్ బాబు, హీరోయిన్ కీర్తి సురేష్‌తో పాటు, వెన్నెల కిషోర్ కూడా కనిపించారు.

comments on sarkaru vaari paata penny song still

సర్కారు వారి పాట సినిమాలో సినిమాలో మొదటి పాట అయిన “కళావతి” ఇటీవల విడుదల అయ్యింది. ఇందులో మహేష్ బాబు, కీర్తి సురేష్ కనిపిస్తున్నారు. ఈ పాటని ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ పాడారు. కళావతి పాటకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరొక పాట కూడా విడుదల అవ్వబోతోంది. సర్కారు వారి పాట సినిమాలో రెండో పాట అయిన పెన్నీ మార్చ్ 20 తేదీన విడుదల అవుతోంది. ఈ పాటకు సంబంధించిన పోస్టర్ ఇవాళ విడుదల చేశారు.

comments on sarkaru vaari paata penny song still

అయితే ఇందులో మహేష్ బాబుని చూస్తే ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండే ఒక టెంప్లేట్ గుర్తొస్తోంది. దాంతో మహేష్ బాబు పోజ్ ఇచ్చిన స్టిల్ అలాగే ఉంది అంటూ ఎడిట్ వైరల్ అవుతోంది. ఇంక సినిమా విషయానికి వస్తే సినిమా ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. ఇప్పుడు మేలో విడుదల అవుతుంది అని సినిమా బృందం ప్రకటించింది. ఈ సినిమా తరువాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. అలాగే ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో కూడా నటించబోతున్నారు.

You may also like