Ads
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు స్నేహం, వారి కష్టాలు, వారు ఎలా కలిశారు, అసలు వారు ఎలా పెరిగారు, ఇలా చాలా అంశాలని సినిమాలో చూపించబోతున్నారు. చాలా మంది పెద్ద పెద్ద నటులు నటిస్తున్నారు.
Video Advertisement
ఈ సినిమాతో ఆలియా భట్ తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు. అలాగే ఒలీవియా మోరిస్ కూడా మరొక హీరోయిన్ గా నటిస్తున్నారు. వీరు మాత్రమే కాకుండా అజయ్ దేవగన్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, శ్రియా సరన్ ఇంకా చాలామంది నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
సినిమా బృందం అంతా ప్రస్తుతం ప్రమోషన్స్ పనిలో ఉన్నారు. చాలా డిఫరెంట్ గా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇటీవల అనిల్ రావిపూడి చేసిన ఇంటర్వ్యూ ట్రెండింగ్‌లో ఉంది. తర్వాత రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి చేసిన ఇంటర్వ్యూ కూడా బాగా పాపులర్ అయ్యింది. ఇటీవల ఢిల్లీలో సినిమా ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి అమీర్ ఖాన్ అతిథిగా వచ్చారు. సినిమా టీంని అభినందించారు. అలాగే ఆలియా భట్ కూడా ఈ ఈవెంట్ కి వచ్చారు. ఈవెంట్ చాలా సరదాగా జరిగింది.
ఈ ఈవెంట్ లో ఒక ఇంటర్వ్యూ నిర్వహించి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అయితే ఈ ఈవెంట్ లో ఒక వ్యక్తి, తాను రాజమౌళికి పెద్ద ఫ్యాన్ అని చెప్పారు. ఆ వ్యక్తి పంజా సినిమా అప్పటినుండి రాజమౌళికి తాను చాలా పెద్ద ఫ్యాన్ అని అన్నారు. పంజా సినిమాకి దర్శకత్వం వహించింది రాజమౌళి కాదు. కానీ రాజమౌళి మాత్రం ఏమీ అనకుండా ప్రశ్న అడగమని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా బృందం వివిధ ప్రదేశాలకి వెళ్లి ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు. హైదరాబాద్ లో కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు. అలాగే భారతదేశంలో ఉన్న వేరే ప్రాంతాలకు కూడా వెళ్లి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
watch video :
End of Article