Home Filmy Adda “ఇండియన్ ఐడల్” లో ఈమె పాటకి ఫిదా అవ్వాల్సిందే..!

“ఇండియన్ ఐడల్” లో ఈమె పాటకి ఫిదా అవ్వాల్సిందే..!

by Mohana Priya

టీవీలో సింగింగ్ కాంపిటీషన్స్ కి కొదవ లేదు. ప్రతి ఛానల్ లో దాదాపు ఏదో ఒక సింగింగ్ కాంపిటీషన్ వస్తూనే ఉంటుంది. ఇందులో చాలా మంది ప్రముఖ సెలబ్రిటీలు జడ్జెస్ గా ఉంటారు. ఈ కాంపిటీషన్ ద్వారా ఎంతో మంది సింగర్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇప్పుడు కూడా సరిగమప, పాడుతా తీయగాలాంటి సింగ్ కాంపిటీషన్స్ వస్తూనే ఉన్నాయి.

అయితే ఇవన్నీ మాత్రమే కాకుండా ఆహాలో ఇండియన్ ఐడల్ కూడా వస్తోంది. ఈ ప్రోగ్రాం ఇటీవల మొదలయ్యింది. దీనికి శ్రీ రామచంద్ర యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. తమన్, నిత్యా మీనన్, ప్రముఖ సింగర్ కార్తీక్ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు.

vagdevi alaipongera performance in indian idol telugu

ఈ ప్రోగ్రాంలో రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన ఎంతో మంది సింగర్స్ నుండి కొంత మందిని సెలెక్ట్ చేశారు. ఈ ప్రోగ్రాం శుక్రవారం, శనివారం టెలికాస్ట్ అవుతుంది. ఇందులో వాగ్దేవి అనే ఒక కంటెస్టెంట్ ఇటీవల సఖి సినిమాలోని అలైపొంగెరా పాట పాడింది. ఈ పాటని సినిమాలో హరిణి పాడారు. పాట చాలా కష్టంగా ఉంటుంది. కానీ వాగ్దేవి మాత్రం చాలా బాగా పాడింది. పాటలో పదాలు కూడా చాలా స్పష్టంగా పలికింది.

vagdevi alaipongera performance in indian idol telugu

పాటకి జడ్జెస్ అందరూ చాలా ఇంప్రెస్ అయిపోయారు. పాటలో ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టం. కానీ వాగ్దేవి మాత్రం ఈ పాట చాలా బాగా పాడింది. దాంతో తమన్ స్టేజ్ మీదకు వచ్చి వాగ్దేవిని మెచ్చుకున్నారు. అలాగే గోల్డెన్ మైక్ కూడా ఇచ్చారు. అసలు ఈ పాటలో ఊపిరి తీసుకోవడం చాలా కష్టమని అలాంటి పాట సెలెక్ట్ చేసుకోవడమే ఒక సాహసం అని దానిని ఇంత బాగా పాడటం కూడా చాలా గొప్ప విషయం అని అన్నారు.

watch video :

You may also like