Home Filmy Adda RRR ఫస్ట్ రివ్యూ..! సినిమాకి హైలైట్ ఇవేనంట..!

RRR ఫస్ట్ రివ్యూ..! సినిమాకి హైలైట్ ఇవేనంట..!

by Mohana Priya

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు స్నేహం, వారి కష్టాలు, వారు ఎలా కలిశారు, అసలు వారు ఎలా పెరిగారు, ఇలా చాలా అంశాలని సినిమాలో చూపించబోతున్నారు. చాలా మంది పెద్ద పెద్ద నటులు నటిస్తున్నారు.

ఈ సినిమాతో ఆలియా భట్ తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు. అలాగే ఒలీవియా మోరిస్ కూడా మరొక హీరోయిన్ గా నటిస్తున్నారు. వీరు మాత్రమే కాకుండా అజయ్ దేవగన్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, శ్రియా సరన్ ఇంకా చాలామంది నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

rrr trailer analysis and hidden details

సినిమా బృందం అంతా ప్రస్తుతం ప్రమోషన్స్ పనిలో ఉన్నారు. చాలా డిఫరెంట్ గా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇటీవల అనిల్ రావిపూడి చేసిన ఇంటర్వ్యూ ట్రెండింగ్‌లో ఉంది. తర్వాత రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి చేసిన ఇంటర్వ్యూ కూడా బాగా పాపులర్ అయ్యింది. ఇటీవల ఢిల్లీలో సినిమా ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి అమీర్ ఖాన్ అతిథిగా వచ్చారు. అయితే ఈ సినిమా మొదటి రివ్యూ వచ్చేసింది.

rrr movie review by umair sandhu

 

ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు ఈ సినిమా రివ్యూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసారు. ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ రివ్యూ గురించి ఉమైర్ సంధు ఈ సినిమా రివ్యూ గురించి ఈ విధంగా రాశారు, “ఒక ఇండియన్ ఫిలిం మేకర్ ఇంత పెద్ద కల కని ధైర్యం చేసి, దానిని నిజం చేశారు అని మీకు ఆర్ఆర్ఆర్ చూస్తే అర్థమవుతుంది. ఇది ఖచ్చితంగా మిస్ అవకుండా చూడాల్సిన సినిమా. దీన్ని బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ అని ఇవాళ రేపు అన్నా కూడా భవిష్యత్తులో ఇది ఒక క్లాసిక్ గా గుర్తింపు పొందుతుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కాంబినేషన్ చాలా బాగుంది. అజయ్ దేవగన్ ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్” అని రాశారు.

You may also like