ఏంటి “ఎన్టీఆర్” గారూ… ఇలా అనేసారు..? వైరల్ అవుతున్న RRR ఫన్నీ వీడియో..!

ఏంటి “ఎన్టీఆర్” గారూ… ఇలా అనేసారు..? వైరల్ అవుతున్న RRR ఫన్నీ వీడియో..!

by Mohana Priya

Ads

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు స్నేహం, వారి కష్టాలు, వారు ఎలా కలిశారు, అసలు వారు ఎలా పెరిగారు, ఇలా చాలా అంశాలని సినిమాలో చూపించబోతున్నారు. చాలా మంది పెద్ద పెద్ద నటులు నటిస్తున్నారు.

Video Advertisement

ఈ సినిమాతో ఆలియా భట్ తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు. అలాగే ఒలీవియా మోరిస్ కూడా మరొక హీరోయిన్ గా నటిస్తున్నారు. వీరు మాత్రమే కాకుండా అజయ్ దేవగన్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, శ్రియా సరన్ ఇంకా చాలామంది నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

jr ntr hindi reply in rrr telugu interview goes viral

సినిమా బృందం అంతా ప్రస్తుతం ప్రమోషన్స్ పనిలో ఉన్నారు. చాలా డిఫరెంట్ గా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తెలుగులోనే చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. అలా ఇటీవల ప్రముఖ యాంకర్ ప్రేమతో కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ప్రేమ అడిగిన ప్రశ్నలకి వారు సమాధానాలు చెప్పారు. అయితే ఇంటర్వ్యూలో ప్రేమ అడిగిన ఒక ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్ హిందీలో సమాధానం చెప్పడం మొదలుపెట్టారు.

jr ntr hindi reply in rrr telugu interview goes viral

ప్రేమ ” సినిమాలో ఇద్దరు హీరోలు కలిసి ఒక యాక్షన్ సీక్వెన్స్ చేయడం ఎంత ఛాలెంజింగ్ గా అనిపించింది?” అని అడిగారు. అందుకు జూనియర్ ఎన్టీఆర్, ” మా డైరెక్టర్ రాజమౌళి గారు ఎలా చెప్పారో” అని హిందీలో చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు పక్కనే ఉన్న రామ్ చరణ్, రాజమౌళి ఎన్టీఆర్ వైపు చూశారు. అప్పుడు పక్కనే ఉన్న రాజమౌళి “హిందీ ఇంటర్వ్యూ అయిపోయింది. ఇది తెలుగు ఇంటర్వ్యూ” అని చెప్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

watch video :


End of Article

You may also like