RRR Review : RRR తో “రాజమౌళి” మరో పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

RRR Review : RRR తో “రాజమౌళి” మరో పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

  • చిత్రం : RRR (ఆర్ఆర్ఆర్)
  • నటీనటులు : జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్, ఒలీవియా మోరిస్, సముద్రఖని, శ్రియా సరన్.
  • నిర్మాత : డివివి దానయ్య
  • దర్శకత్వం : ఎస్ ఎస్ రాజమౌళి
  • సంగీతం : ఎం ఎం కీరవాణి
  • విడుదల తేదీ : మార్చ్ 25, 2022

స్టోరీ :

Video Advertisement

అదిలాబాద్ జిల్లాలోని ఒక అటవీ ప్రాంతంలో సినిమా కథ మొదలవుతుంది. 1920 లో స్వతంత్రం రాకముందు ఉన్న పరిస్థితులు సినిమాలో కనిపిస్తాయి. అక్కడ మల్లి అనే ఒక అమ్మాయిని బ్రిటిష్ వాళ్ళు తీసుకువెళ్లిపోతారు. ఆ అమ్మాయి కోసం కొమరం భీమ్ (జూనియర్ ఎన్టీఆర్) బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటాడు. కొమరం భీమ్ ని పట్టుకునే బాధ్యతని అల్లూరి సీతారామరాజు (రామ్ చరణ్) కి అప్పగిస్తారు. కొమరం భీమ్ ని అల్లూరి సీతారామరాజు పట్టుకొని బ్రిటిష్ వాళ్ళకి అప్పగించాడా? లేదా వారు ఇద్దరు స్నేహితులు అయ్యారా? సీత (ఆలియా భట్) ఎవరు? సీత వల్ల రామ్, భీమ్ ఎలా మారారు? ఇద్దరూ కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎలా పోరాడారు? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

rrr movie review

రివ్యూ :

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు? వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది. సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి.

rrr movie review

సినిమా చూస్తున్నంత సేపు కూడా మనకి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తెరపై కనిపించరు. కేవలం వారు పోషించిన పాత్రలు మాత్రమే కనిపిస్తారు. ఈ సినిమా తర్వాత మరిన్ని పెద్ద హీరోల మల్టీస్టారర్ సినిమాలు వచ్చే అవకాశాలు ఉండొచ్చు. పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే, కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ తమ పాత్రలకి ప్రాణం పోశారు. రంగస్థలం తర్వాత మళ్ళీ రామ్ చరణ్ కి అంత మంచి పాత్ర లభించింది. సినిమాలో చాలామంది పెద్దపెద్ద నటులు ఉన్నారు. కానీ ఎవరికీ అంత పెద్ద ప్రాధాన్యం ఉన్న పాత్ర లభించలేదు. హీరోయిన్ గా నటించిన అలియా భట్ కూడా కొంచెం సేపు కనిపించి వెళ్ళిపోతారు.

rrr movie review

ఆలియా భట్, రామ్ చరణ్ మధ్య ఇంకా ఎక్కువ సీన్స్ ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. కానీ ఆలియా భట్, జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య వచ్చే సీన్స్ కొంచెం ఎమోషనల్ గా ఉంటాయి. మరొక హీరోయిన్ అయిన ఒలీవియా మోరిస్ కూడా ఫస్ట్ హాఫ్ లో కనిపిస్తారు. అజయ్ దేవగన్ ఒక ముఖ్య పాత్రలో నటించారు. సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, అలిసన్ డూడీ కొంచెం ఎక్కువ సేపు తెరపై కనిపిస్తారు. కీరవాణి అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎమోషన్స్ ని ఇంకా ఎలివేట్ చేసింది. నాటు నాటు పాట తెరపై చూడటానికి చాలా బాగా అనిపించింది. కొరియోగ్రఫీ, హీరోలు డాన్స్ చేసిన విధానం కూడా చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది.

rrr movie review

ప్లస్ పాయింట్స్ :

  • ఇద్దరు హీరోలు
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్
  • ఎలివేషన్స్
  • క్లైమాక్స్

రేటింగ్ :

5/5

ట్యాగ్ లైన్ :

బాహుబలితో తెలుగు సినిమా ఇండస్ట్రీని మరొక స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి, ఆర్ఆర్ఆర్ తో చాలా కాలం వరకు ప్రేక్షకులకి గుర్తుండిపోయే ఒక గొప్ప సినిమాని అందించారు.


End of Article

You may also like