Ads
ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?
Video Advertisement
వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది. సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి.
సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. క్రిటిక్స్ అందరు కూడా సినిమాని చాలా బాగా పొగుడుతున్నారు. అయితే ఒక క్రిటిక్ మాత్రం ఈ సినిమాపై కామెంట్స్ చేసారు. బాలీవుడ్ నటుడు, క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ, “ఆర్ఆర్ఆర్ ఒక తలా, తోకా లేని సౌత్ మసాలా సినిమా. రాజమౌళి నా సెన్సెస్ ని చంపేశారు. నా బుద్ది మొత్తం జీరో అయిపోయింది. ఎలా చేస్తారు అండి ఇలా? చాలా బాగా అనిపించింది.
ప్రతి డైరెక్టర్ కి ఆగ్ లాంటి సినిమా ఒకటి ఉంటుంది. ఆర్ఆర్ఆర్ మీ ఆగ్. ఇలాంటి చెత్త సినిమా భారతీయ సినిమా చరిత్రలోనే తీయలేదు. ఈ సినిమా బతికుండంగానే మనిషిని చంపేస్తుంది. భారతదేశంలోనే ఇది ఒక చెత్త సినిమా. దీనిని పొరపాటు అని కాదు. పెద్ద క్రైమ్ అనాలి. ఇలా 600 కోట్లు పెట్టి ఇలాంటి ఒక సినిమా తీసినందుకు రాజమౌళిని కనీసం 6 నెలలు జైల్ లో పెట్టాలి” అని రాసారు. దాంతో నెటిజన్లు అందరూ కమాల్ ఆర్ ఖాన్ ని తిడుతున్నారు.
End of Article