Ads
కేజీఎఫ్ కన్నడ సినిమా అయినా కూడా తెలుగులో చాలా పాపులారిటీ దక్కించుకుంది. ఒక తెలుగు సినిమా కోసం ఎలా అయితే ప్రేక్షకులు ఎదురు చూస్తారో కేజీఎఫ్ సినిమా కోసం కూడా తెలుగు ప్రేక్షకులు అలాగే ఎదురు చూస్తున్నారు. ఇటీవలే కేజీఎఫ్ – 2 ట్రైలర్ విడుదల అయ్యింది.
Video Advertisement
సెకండ్ పార్ట్ లో రవీనా టాండన్, సంజయ్ దత్, ఈశ్వరీ రావు, ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు. ట్రైలర్ చూస్తే ప్రకాష్ రాజ్ మనకి కథ చెబుతున్నట్లు తెలిసిపోతోంది.
అనంత్ నాగ్ తో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఈ సినిమాలో అలాంటి ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ట్రైలర్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదటి భాగంలో పోలిస్తే ఈ సినిమాలో చాలా విషయాలు ఉండబోతున్నాయి. అలాగే యాక్షన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ కి సంబంధించిన ఒక కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒక యూట్యూబ్ యూజర్ సినిమా ట్రైలర్ చూసి ఈ విధంగా కామెంట్ పెట్టారు. “నేను యష్ అభిమానిని. కానీ KFC ట్రైలర్ నన్ను డిసప్పాయింట్ చేసింది. ఈసారి బీస్ట్ సినిమా ట్రైలర్ బాగుంటుందేమో. నేను బీస్ట్ సినిమాకి వెళ్తాను” అని రాశారు. ఒకసారి ఆ యూజర్ ఐడి చూస్తే మాస్టర్ మణి ఎయిత్ క్లాస్ బి సెక్షన్ (8th class B section) అని రాసి ఉంది. దాంతో నెటిజన్లు అందరూ, “కనీసం సినిమా పేరు అయినా కరెక్ట్ గా రాయి” అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ కామెంట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
End of Article