Home Filmy Adda “రాధే శ్యామ్” సినిమాలో ఈ 2 సీన్స్ మధ్య ఉన్న… ఈ పాయింట్ గమనించారా..?

“రాధే శ్యామ్” సినిమాలో ఈ 2 సీన్స్ మధ్య ఉన్న… ఈ పాయింట్ గమనించారా..?

by Mohana Priya

దాదాపు 2 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ థియేటర్లలో విడుదల అయ్యింది. ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉన్న ఈ సినిమా కోవిడ్ కారణంగా వాయిదా పడి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా టాక్ మొద‌ట చాలా మిక్స్‌డ్‌గా వ‌చ్చింది.

హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ సరిగ్గా లేదు అని, సినిమా చాలా స్లోగా ఉంది అని ఇలా చాలా కామెంట్స్ వచ్చాయి. కానీ లవ్ స్టోరీ అంటే సాధరణంగా చాలా స్లోగా ఉంటుంది. సినిమా ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్‌లో కూడా విడుద‌ల అయ్యింది. ఇందులో చాలా సీన్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రాధే శ్యామ్ దర్శకుడు రాధాకృష్ణ ఒక 2 సీన్స్ గురించి మాత్రం చెప్పారు.

changes in radhe shyam telugu and hindi versions

ఒక సీన్ లో హీరోయిన్ హీరోని మొదటి సారి చూసినప్పుడు, “నా బరువు మోయగలవా?” అని అడుగుతుంది. హీరో హీరోయిన్ మొదటిసారి కలుసుకునే సీన్. ఈ సీన్ సరిగ్గా గమనిస్తే ఇందులో గాలి, నీరు, నేల, ఆకాశం, నిప్పు అన్నీ ఉంటాయి. చివరిలో కూడా హీరో హీరోయిన్ కలుసుకునే ముందు ఒక పెద్ద షిప్ నీటిలోకి మునిగి పోయే సీన్ ఉంటుంది. ఆ సీన్ సరిగ్గా గమనిస్తే అందులో కూడా ఇలాగే గాలి, నీరు, నేల, ఆకాశం, నిప్పు ఉంటాయి. ఈ రెండు సీన్స్ లో పంచభూతాలు ఉంటాయి.

did you observe these 2 scenes in radhe shyam movie

ఈ విషయం గురించి దర్శకుడు రాధా కృష్ణ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే ఈ సినిమాలో రాధాకృష్ణుల రిఫరెన్స్ కూడా ఉంటుంది. సినిమా స్టోరీ కూడా ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది. అందుకు మొదటి కారణం ప్రభాస్ లవ్ స్టోరీ చేసి చాలా రోజులు అయ్యింది. ఈ సినిమాలో ఒక్క ఫైట్ సీన్ కూడా లేదు. అలాగే హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే కి కూడా సినిమా చాలా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

You may also like