Ads
గత కొన్ని నెలల నుంచి రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. రష్యా ఉక్రెయిన్ పై విరుచుకుపడుతూ ఇప్పటికే కివ్ లాంటి పెద్ద నగరాలను స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో యుద్ధం గురించి కొన్ని విషయాలను పాశ్చాత్య దేశాలకు రిలీజ్ చేశారనే ఆరోపణతో ఏకంగా 150 మందికి పైగా సైనికులను, నిఘా అధికారులను అదుపులోకి తీసుకుంది రష్యా.
Video Advertisement
ఉక్రెయిన్ పై యుద్ధం మొదలు పెట్టిన కొద్ది గంటల్లోనే ఆ దేశ యుద్ధ ప్రణాళికను ఇంగ్లాండ్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. సైనికులు ఏ మార్గంలో వెళ్తున్నారు అనేది కచ్చితంగా అంచనా వేస్తూ వచ్చింది. దీనిపై దేశ అధ్యక్షుడు పుతిన్ తీవ్రమైన కోపంతో ఉన్నారని తెలుస్తోంది. ఆయనకు చాలా సన్నిహితుడు అయిన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ విదేశీ విభాగ అధిపతి సెర్గి బేసేడాతొ పాటుగా 150 మందిని అరెస్టు చేశారు.
వీరిని మాస్కోలోని స్టాలిన్ హయాంలో కట్టించిన అత్యంత కట్టుదిట్టమైన లేపోర్టివు జైలుకు తరలించారు. ఈ వ్యవహారంపై మిలటరీ ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా దర్యాప్తు చేయాలని పుతిన్ ఆదేశించారు. వాస్తవంగా జరిగిన పరిస్థితులు చెప్పకపోగా, రష్యా సైన్యాన్ని సాగించేందుకు ఉక్రేనియన్ లు సిద్ధంగా ఉన్నారంటూ తప్పుదోవ పట్టించారనే నెపంతో అదుపులోకి తీసుకున్నారని కొన్ని మీడియా సంస్థలు తెలియజేస్తున్నాయి. యుద్ధంలో రష్యా దెబ్బ తినడానికి కారణం నిఘా వర్గాల లీకేజీ అని పుతిన్ భావిస్తున్నట్లు సమాచారం.
End of Article