Ads
రైలులో ప్రయాణించేటప్పుడు కొంతమంది టికెట్ లేకుండానే ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇకపై అలాంటి వారి ఆటలు సాగవు అంటోంది రైల్వే శాఖ. ఇన్ని రోజులు రైల్వే టికెట్ కలెక్టర్ వద్ద కాగితాలు మాత్రమే ఉండేవి. అయితే తదుపరి స్టేషన్ లో ఎన్ని బెర్త్ లు బుక్ అయ్యాయని, ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి అలాంటి వివరాలు రైలు కదిలితే తప్ప తెలిసేది కాదు.
Video Advertisement
దీంతో రిజర్వేషన్ ఉన్న వారు ఎవరు, టికెట్ తీసుకుని వారెవరో, ఆర్ఏసి తో ప్రయాణిస్తున్న వారు ఎక్కడెక్కడున్నారో వారు తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది ఉండేది. కానీ ఇప్పుడు టీసీలందరి చేతుల్లోకి హ్యాండ్హెల్డ్ టెర్మినల్స్ యంత్రాలు వస్తున్నాయి. ఇవి రైల్వే శాఖ ప్రధాన సర్వర్ తో అనుసంధానం చేయబడి ఉంటాయి. అయితే టికెట్ ఎక్కడ బుక్కయిన చిటికెలో టీసీలకు సమాచారం అందుతుంది. దీని ద్వారా టికెట్ లేకుండా ప్రయాణించేవారిని సులువుగా గుర్తించవచ్చు.
గత సంవత్సరం 111.52 కోట్ల రూపాయలు జరిమానా ద్వారా రైల్వేశాఖ ఆర్జించింది. కాగా బుధవారం దక్షిణ మధ్య రైల్వే కు చెందిన ప్రిన్సిపాల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ జాన్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో టికెట్ యొక్క తనిఖీ అంశం పై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో హ్యాండ్హెల్డ్ టెర్మినల్స్ ఎక్కువ సంఖ్యలో అందించాలని కోరారు. ఈ యంత్రం ద్వారా టికెట్లు లేని ప్రయాణికులు సంఖ్య తగ్గించడమే కాకుండా రైల్వే శాఖకు ఆదాయం కూడా వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
End of Article