Ads
హైదరాబాద్ నగరం సర్వాంగసుందరంగా మారబోతోంది. ఇప్పటికే మెట్రో తో దూసుకుపోతున్న మహా నగరం మరో పెద్ద మహాద్భుత నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. పార్కులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా భూగర్భం నుంచి సొరంగ మార్గం వేసేందుకు వ్యూహాలను అన్వేషిస్తోంది. అంత అనుకున్నట్లు జరిగితే మాత్రం అతిపెద్ద సొరంగ మార్గానికి హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ గా మారనుంది.
Video Advertisement
కాగా నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఇప్పటికే ఫ్లైఓవర్లు అండర్ పాస్ నిర్మాణంతో దూకుడుగా ఉన్న జిహెచ్ఎంసి మరో వినూత్న ప్రయోగానికి తెరలేపింది. దుర్గం చెరువు నుంచి కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో జూబ్లీహిల్స్ ఐటీ కారిడార్ కు ఈజీ వే చేసిన బల్దియా. కేబీ ఆర్ పార్క్ ఎకో సెన్సిటివ్ జోన్ ఉండటంతో పార్కు లో ఉన్నటువంటి ఒక్క చెట్టు కూడా జిహెచ్ఎంసి ముట్టుకోలేదు.ఈ తరుణంలో బల్దియా మల్టీలెవల్ ఫ్లైఓవర్ నిర్మాణం మాత్రం జరిగితే దాదాపుగా పదిహేను వందల చెట్లు కూల్చాల్సిన పరిస్థితి ఏర్పడేది.
దీంతో వేరే మార్గాలను అన్వేషించాలని మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సొరంగ మార్గాన్ని తవ్వి నిర్మాణం చేపడితే ఎలా ఉంటుంది అని ఆలోచనలో జిహెచ్ఎంసి ఆచరణలో పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు గురించి స్టడీ చేసేందుకు మే రెండో తేదీ వరకు టెండర్లు వేయడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత అర్హత కలిగిన ఏజెన్సీకి స్టడీ చేసేందుకు టెండర్ ఇస్తారు. సదరు ఏజెన్సీ స్టడీ చేసి తొమ్మిది నెలల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే డిపిఆర్ రూపొందించడం తర్వాత అంచనా వ్యయం లెక్కకట్టి నిర్మాణం చేపడతారు.
End of Article